క్లారిటీ ఇచ్చిన చైతూ...

Tuesday,October 04,2016 - 01:45 by Z_CLU

ఇంకా పర్టికులర్ డేట్ ఎనౌన్స్ కాకపోయినా  నాగచైతన్య, సమంతాల పెళ్లి అఫీషియల్ గా పక్కా అయిపోయింది. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో నాగచైతన్య పెళ్లి విషయాన్ని ఓకే చేశాడు. కాబట్టి సమంతా పెళ్లి తరవాత పూర్తిగా ఇంటికే పరిమితం అయిపోతుందని అంతా ఫిక్స్ అయిపోయారు. సో.. ఆమె కెరీర్ లో చివరి చిత్రం జనతా గ్యారేజ్ మాత్రమే అని అంతా అనుకుంటున్నారు. అయితే ఇక్కడే చైతూ క్లారిటీ ఇచ్చాడు.

samantha-and-naga-chaitanya-stills-at-nimmagadda-prasad-daughter-wedding-5

       “నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నానంటే నాకు రెండు ఫ్యామిలీస్ నుండి చాలా సపోర్ట్ దొరికింది. కానీ సమంతా ఏ సపోర్ట్ లేకుండానే ఈ స్థాయికి చేరుకుంది.” అని చెప్పిన నాగచైతన్య…. పెళ్లి తర్వాత సినిమాల్లో కొనసాగాలా వద్దా అనే నిర్ణయాన్ని సమంత తీసుకుంటుందని తెలిపాడు. సినిమాలు ఆపేయమని తన కుటుంబం నుంచి ఎవరూ సమంతపై ఒత్తిడి తీసుకురామని అంటున్నాడు.