హీరో చేత‌న్ మద్దినేని ఇంటర్వ్యూ

Wednesday,June 19,2019 - 01:51 by Z_CLU

‘రోజులు మారాయి’ సినిమాతో హీరోగా పరిచయమైన చేతన్ మద్దినేని ‘ ఫస్ట్ ర్యాంక్ రాజు’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. కన్నడ సినిమాకు రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా జూన్ 21 న విడుదలవుతుంది. ఈ సందర్భంగా చేతన్ మీడియాతో మాట్లాడాడు. ఆ విశేషాలు చేతన్ మాటల్లోనే….

 

యూనివర్సల్ సబ్జెక్ట్

ఫస్ట్ ర్యాంక్ రాజు యూనివర్సల్ సబ్జెక్ట్.. ఆ కథకి ఎవరైనా కనెక్ట్ అయిపోతారు. అందుకే రీమేక్ చేసాం. మా నాన్న గారి స్నేహితులు ఈ సినిమా రీమేక్ చేస్తే బాగుంటుందని సజస్ట్ చేసారు. అందుకే కన్నడలో సూపర్ హిట్ అయిన సినిమాను అదే టైటిల్ తో రీమేక్ చేశాం.

 

కొన్ని మార్పులతో

సినిమాలో సోల్ మిస్ అవ్వకుండా ఆ కథకి తగ్గుట్టుగా తెలుగులో స్క్రిప్ట్ రెడీ చేశాం. ఒరిజినల్ కథ తీసుకొని కొన్ని మార్పులతో సినిమాను తెరకెక్కించాం. ముఖ్యంగా స్టూడెంట్స్ కి ఎక్కువగా నచ్చుతుంది.

 

వాళ్ళ బయోపిక్

ఈ సినిమా ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్స్ బయోపిక్ లా అనిపిస్తుంది. అందుకే వాళ్ళు సినిమాకి ఎక్కువగా కనెక్ట్ అవుతారు. రాజు క్యారెక్టర్ ని ఓన్ చేసుకొని సినిమా చూస్తారు.

 

ఆయనే నిర్మాత

ఫస్ట్ ర్యాంక్ రాజు రీమేక్ రైట్స్ కోసం నిర్మాతని సంప్రదిస్తే ఆయనే తెలుగులో కూడా నిర్మిస్తానని చెప్పారు. కథ మీద ఆయనకీ చాలా నమ్మకం. అందుకే తెలుగులో కూడా ఆయనే నిర్మించారు. ఎక్కడా రాజీ పడకుండా నిర్మించారు.

 

మారుతి గారి ఇన్ పుట్స్ తో …..

ఈ సినిమాను రీమేక్ చేయాలనుకున్నప్పుడు మారుతీ గారి దగ్గరికి వెళ్ళాం. ఆయన మా ఫ్యామిలీ ఫ్రెండ్. స్క్రిప్ట్స్ లో కొన్ని ఇన్ పుట్స్ కూడా ఇచ్చారు. ఆయన చెప్పిన మార్పులు సినిమాకు ప్లస్ అయ్యాయి. సినిమాకు ఆయన సపోర్ట్ చాలా ఉంది. ఈరోజు గీతా డిస్ట్రిబ్యూషన్ సంస్థ ద్వారా సినిమా రిలీజవ్వడానికి ఆయనే కారణం.

 

మంచి రోల్స్ వస్తున్నాయి

నిజానికి నటుడిగా నాకు స్టార్టింగ్ లోనే మంచి రోల్స్ వచ్చాయి. రోజులు మారాయి తర్వాత ‘గల్ఫ్’ సినిమా రూపంలో అనుకోని ఛాలెంజింగ్ క్యారెక్టర్ వచ్చింది. ఇప్పుడు ఫస్ట్ ర్యాంక్ రాజు. ఫ్యూచర్ లో కూడా మరిన్ని డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయాలనుంది.

 

నెక్స్ట్ సినిమా అదే

రీసెంట్ గా ఐ ఫోన్ సెవెన్ ప్లస్ తో సినిమా తీసాం. సినిమా బాగా వచ్చింది. ‘ఐ ఫోన్ ప్రేమికుడు’ అనే టైటిల్ అనుకుంటున్నాం. త్వరలోనే ఆ సినిమా వివరాలు తెలియజేస్తాను.