మెగాస్పీడ్ అందుకున్న చెర్రీ

Thursday,January 12,2017 - 02:00 by Z_CLU

మెగా పవర్ స్టార్ మెగా స్పీడ్ మీదున్నాడు. ఓ వైపు ధృవ సక్సెస్, మరో వైపు ప్రొడ్యూసర్ గా డెబ్యూ మూవీ ఖైదీ నం 150, రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ తో హిట్ టాక్ తో దూసుకుపోతుంది. ఇంత ఎగ్జైట్ మెంట్ లోను, బిజీ షెడ్యూల్స్ లోను ఏ మాత్రం డీవియేషన్ లేకుండా తన నెక్స్ట్ వెంచర్ పై అప్పుడే ఫోకస్ పెట్టేశాడు.

స్టైలిష్ లుక్ తో ధృవ లో ఎట్రాక్ట్ చేసిన చేసిన చెర్రీ, సుకుమార్ సినిమాలో మరో కొత్త లుక్ లో, సరికొత్త కాన్సెప్ట్ తో గెట్ రెడీ అంటున్నాడు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ కి ఆల్ సెట్ ట్యాగ్ ని కట్టేసిన సుక్కు, మంచి టైం చూసుకుని సినిమాని సెట్స్ పైకి తీసుకువచ్చే ఆలోచనలో ఉన్నాడు.

ధృవ సినిమాతో ఎనర్జిటిక్, యూనిట్ కంటెంట్ ఉండాలి కానీ సినిమాకి సక్సెస్ కి పెద్ద దూరం ఉండదు క్లారిటీ తెచ్చుకున్న చెర్రీ, ఇప్పుడు అదే ఫాం లో, అదే స్పీడ్ తో కరియర్ ని ప్లాన్ చేసుకున్నాడు. చేరీ, సుక్కు స్పీడ్ చూస్తుంటే సినిమాని జనవరి ఎండింగ్ కల్లా సినిమా సెట్స్ పైకి వచ్చే సూచనలు ఎక్కవగానే కనిపిస్తున్నాయి.