చెర్రీ ఫన్ టైం విత్ ఫ్యాన్స్

Tuesday,January 10,2017 - 08:00 by Z_CLU

కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ అధినేత… మెగా ప్రొడ్యూసర్ రామ్ చరణ్ అనేకన్నా.. సింపుల్ గా చెర్రీ అంటేనే ఫ్యాన్స్ ఫీస్ట్ లా ఫీల్ అవుతారు. ఏదో రకంగా ఫేస్ బుక్ లోనో, ట్విట్టర్ లోనో ఏదో రకంగా ఫ్యాన్స్ కి దగ్గరగా ఉండే చెర్రీ, ఫేస్ బుక్ ఆఫీస్ లో, ఫ్యాన్స్ తో ఫన్ టైం ని స్పెండ్ చేశాడు.

ఫ్యాన్స్ అడిగే ఫన్నీ క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్తూనే, వారితో ఆడి పాడిన చెర్రీ… ఇంత బిజీ షెడ్యూల్ లోను, ఫ్యాన్స్ కి ఓపిగ్గా సమాధానాలు చెప్పాడు చెర్రీ. మెగాస్టార్ తన గత సినిమాలతో కంపేర్ చేస్తే, ఈ సినిమాలోనే ఇంకా ఎనర్జిటిక్ గా ఉన్నారని చెప్పుకున్నాడు.

అన్ లిమిటెడ్ స్టార్ డం తో పాటు సక్సెస్ ఫుల్ బిజినెస్ మ్యాన్ గా కూడా దూసుకుపోతున్న చెర్రీ,  ఖైదీ నం 150 తరవాత, బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బెస్ట్ ప్రొడ్యూసర్ అనిపించుకోవడం పెద్ద కష్టమేమీ కాదేమో అనిపిస్తుంది.