సుకుమార్ కోసం ఆ గెటప్ ...

Wednesday,January 04,2017 - 09:00 by Z_CLU

లేటెస్ట్ గా  ‘ధృవ’ సినిమాలో డిఫరెంట్ లుక్ లో కనిపించి అందరినీ ఎట్రాక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న  మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నెక్స్ట్ సినిమా కోసం మరో డిఫరెంట్ లుక్  ట్రై చేస్తున్నాడు. సుకుమార్ డైరెక్షన్ లో తెరకెక్కనున్న తన నెక్స్ట్ సినిమాను జనవరి ఎండింగ్ నుంచి సెట్స్ పైకి తీసుకురావాలని చూస్తున్న చెర్రీ ఆ సినిమా లో డిఫరెంట్ లుక్ తో ఎంటర్టైన్ చేయడానికి రెడీ అవుతున్నాడు.

    ఇక సుకుమార్ హీరో అంటే కాస్త స్టైలిష్ గా అటు మాస్ ను ఇటు క్లాస్ ను ఎట్రాక్ట్ చేసే లుక్ తో ఉండడం సహజమే. అందుకే చెర్రీ కూడా సుకుమార్ కోసం తన బాడీ ని తగ్గించి మరీ కాస్త స్లిమ్ గా స్టైలిష్ గడ్డం తో కనిపించబోతున్నాడట. విల్లేజ్ ఫామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమా లో చెర్రీ లుక్ ఎలా ఉండబోతుందో? తెలియాలంటే మాత్రం ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.