కబాలి కోసం సెలవట !

Tuesday,July 19,2016 - 10:39 by Z_CLU

 

సూపర్ స్టార్ రజిని కాంత్ నటించిన తాజా చిత్రం ‘కబాలి’ విడుదలకు సిద్ధం అయ్యింది. ఇంకో రెండు రోజుల్లో భారీ అంచనాలతో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. అయితే ఇప్పటికే పబ్లిసిటీ లో ది బెస్ట్ సినిమా గా నిలిచిన ‘కబాలి’ మరో సారి అందరినీ అవాక్కయ్యేలా చేసింది. ఇందుకు కారణం చెన్నై లోని కొన్ని ప్రయివేట్ కంపెనీ లకు ఈ సినిమా విడుదల రోజు అంటే జులై 22 న సెలవు ప్రకటించారు ఆ కంపెనీ యజమానులు. మరి సినిమా విడుదలకి ఇలా సెలవులు ఇవ్వడం ఇదే మొదటి సారి కావడం తో ఒక్క సారి గా ఈ వార్త విన్న అందరు అవాక్కవుతున్నారు. ఇప్పటికే ఈ సినిమా పోస్టర్స్ విమానం పై , అలాగే రెస్టారెంట్, కాఫీ షాపుల్లో కనిపిస్తూ హల్ చల్ చేస్తుండగా ఇప్పుడు ఈ సెలవు వార్త కూడా సోషల్ మీడియా లో తెగ హల్ చల్ చేస్తుంది. అయితే ఇలా కంపెనీ లకు సెలవులు ఇవ్వడానికి కారణం మాత్రం రజిని పై తమిళ ప్రేక్షకులకు ఉండే ప్రేమ అభిమానమే. ఆ అభిమాననాన్ని కొన్ని వ్యాపార సంస్థలు కాష్ చేసుకొని వారి బ్రాండ్స్ పై కబాలి టికెట్స్ అంటూ ఆఫర్స్ పెట్టి వ్యాపారాలు చేసుకుంటున్నారని సమాచారం. ఇక ఈ సినిమా టికెట్స్ లేవంటూ చెన్నై లో అన్ని థియేటర్స్ లో బోర్డులు కూడా పెట్టేసారు. ఇక విదేశాలతో పాటు ఆంద్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో కూడా ఆల్మోస్ట్ ఇదే పరిస్థితి. మరి విడుదలకి ముందే ట్రెండ్ అయినా ఈ సినిమా విడుదల తరువాత కలెక్షన్స్ తో ఏ రేంజ్ రికార్డు సాధిస్తుందో? చూడాలి.