Nithiin Check - మళ్ళీ మొదలైంది

Friday,October 16,2020 - 03:54 by Z_CLU

లాక్ డౌన్ నేపథ్యం షూటింగ్ వాయిదా పడిన సినిమాల్లో Nithin Check Movie ఒకటి. ఇటివలే టైటిల్ ఎనౌన్స్ మెంట్ ప్రీ లుక్ పోస్టర్ తో అందరినీ ఎట్రాక్ట్ చేసిన ఈ సినిమా ఈరోజు నుండి మళ్ళీ షూటింగ్ మోడ్ లోకి వచ్చేసింది. హైదరాబాద్ లో ఈరోజు నుండి చివరి షెడ్యుల్ జరుపుకోనున్న ఈ సినిమా వచ్చే ఏడాది థియేటర్స్ లోకి రానుంది.

భవ్య క్రియేషన్స్ బ్యానర్ ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకు చంద్ర శేఖర్ ఏలేటి దర్శకుడు. Rakul Preet , ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్స్ నటిస్తున్న ఈ సినిమా క్రైం థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతుంది.

సినిమాలో ఉరిశిక్ష పడిన ఖైదీగా కనిపించబోతున్నాడు నితిన్. ప్రస్తుతం షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా శరవేగంగా జరుగుతుంది.

Also Check – చెక్ మూవీ స్టిల్స్