Chavu kaburu Challaga - టీజర్ రెడీ

Saturday,January 09,2021 - 05:30 by Z_CLU

‌బన్నీ వాసు నిర్మాత‌గా.. యంగ్ హీరో కార్తికేయ‌, బ్యూటిఫుల్ లావ‌ణ్య త్రిపాఠి జంట‌గా వస్తున్న సినిమా ‘చావు క‌బురు చ‌ల్ల‌గా’. కౌశిక్ పెగ‌ళ్ల‌పాటి ఈ మూవీతో దర్శకుడిగా మారుతున్నాడు. ఇప్పటికే విడుదలైన టైటిల్.. హీరో కార్తికేయ ‘బ‌స్తి బాల‌రాజు’ ఫ‌స్ట్ లుక్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ త‌రువాత విడుద‌లైన క్యారెక్ట‌ర్ వీడియో, లావణ్య త్రిపాఠి ఫస్ట్ లుక్ కి కూడా మంచి స్పంద‌న వచ్చింది.

ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన టీజర్ గ్లింప్స్ జనవరి 11 ఉదయం 10 గంటల 56 నిమిషాలకు విడుదల కానుంది. ఈ మేరకు పోస్టర్ కూడా విడుదల చేశారు దర్శక నిర్మాతలు. కార్తికేయ ఫుల్ మాస్ లుక్ లో కనిపిస్తున్నాడు.

Chavu-kaburu-Challaga-movie-karthikeya 2

మరోవైపు లావణ్య త్రిపాఠీ లుక్ చాలా నాచురల్ గా కనిపిస్తుంది. సినిమాలో ఆమె పాత్ర పేరు మల్లిక. ఈ సినిమాకు.. జకీస్ బీజాయ్ సంగీతం అందిస్తున్నారు. ఈ సమ్మర్ కు థియేటర్లలోకి రాబోతోంది చావుకబురు చల్లగా మూవీ.