బాలకృష్ణ సరసన మరోసారి చార్మి

Saturday,April 01,2017 - 11:02 by Z_CLU

ప్రస్తుతం పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు బాలకృష్ణ. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లకు చోటుంది. వీళ్లలో ఒక హీరోయిన్ గా ముస్కాన్ ను ఇప్పటికే సెలక్ట్ చేశారు. ఇప్పుడు సెకెండ్ హీరోయిన్ గా చార్మిని తీసుకునే అవకాశాల్ని పరిశీలిస్తున్నారు. బాలకృష్ణ ఓకే చెబితే, చార్మి హీరోయిన్ గా ఫిక్స్ అయిపోయినట్టే.

గతంలో బాలయ్య, చాార్మి కలిసి అల్లరిపిడుగు సినిమా చేశారు. మళ్లీ ఇన్నేళ్లకు ఈ పంజాబీ బ్యూటీకి ఛాన్స్ ఇస్తున్నారు బాలకృష్ణ. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ఇష్యూ..త్వరలోనే ఫైనలైజ్ అయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు ఈ సినిమాకు టైటిల్ ఫిక్స్ చేసే పనిలో కూడా పూరి జగన్నాధ్ బిజీగా ఉన్నాడు.

బాలయ్య-పూరి సినిమా ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ పూర్తిచేసుకుంది. మరో వారం రోజుల్లో ఈ సినిమాకు సంబంధించి సెకెండ్ షెడ్యూల్ మొదలవుతుంది. ఈ రెండు షెడ్యూల్స్ తర్వాత ఫారిన్ షెడ్యూల్ ఉంటుంది. ఈ సినిమాలో బాలకృష్ణ గ్యాంగ్ స్టర్ గా నటిస్తున్నారు.