చిరు కోసం భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్న చరణ్ ?

Saturday,August 20,2016 - 07:05 by Z_CLU

 

దాదాపు 8 ఏళ్ళ తరువాత వెండి తెర పై కథనాయకుడిగా కనిపించడానికి సిద్దమవుతున్నాడు మెగా స్టార్ చిరంజీవి. ఇందుకోసం తమిళ చిత్రం ‘కత్తి’ ను రీమేక్ చెయ్యాలని డిసైడ్ అయి సెట్స్ పై పెట్టేసాడు కూడా. ఇక చాలా గ్యాప్ తరువాత రి ఎంట్రీ ఇస్తున్న చిరు 150 వ సినిమా పై భారీ అంచనాలే నెలకొంటున్నాయి. అయితే ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ను ఆగస్టు 22 న చిరు పుట్టినరోజు సందర్భంగా విడుదల చెయ్యాలని భావిస్తున్నారు చిత్ర యూనిట్. ఇందు కోసం యూనిట్ సభ్యులు ఓ భారీ వేదిక ను వెతుకుతున్నట్లు సమాచారం. ఈ టీజర్ ఆవిష్కరణ వేడుక కు భారీ స్థాయి లో మెగా అభిమానులు హాజరు కానున్నారని ఫిలిం నగర్ వర్గాల టాక్. ఇక ఇప్పటి వరకూ ఏ సినిమా టీజర్ ఆవిష్కరించని విధంగా భారీ గా ప్లాన్ చేస్తున్నాడంట చిరు తనయుడు రామ్ చరణ్. ఇదే నిజమైతే ఈ వేడుక తో మెగా అభిమానుల పండుగ మరింత ఆనందంగా మారుతుందనడం లో ఎటు వంటి సందేహం లేదు..