చరణ్ లో మరో కోణాన్ని చూపనున్న'రంగస్థలం'

Sunday,January 07,2018 - 04:15 by Z_CLU

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్ లో ‘రంగస్థలం’ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.  ఆల్మోస్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మార్చ్ 30 రిలీజ్ డేట్ లాక్ చేసుకుంది. ఈ సినిమాతో చరణ్ ని ఓ డిఫరెంట్ లుక్ లో ప్రెజెంట్ చేయబోతున్న సుకుమార్ చరణ్ లోకి మరో కోణాన్ని కూడా బయట పెట్టబోతున్నాడట.

1985 బ్యాక్ డ్రాప్ లో విలేజ్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో ఊర మాస్ లుక్ లో కనిపిస్తూ ఎంటర్ టైన్ చేయనున్న చరణ్ మరో వైపు తన నటనతో కామెడీ కూడా పండిస్తాడని, కొన్ని సందర్భాలలో చరణ్ చేసే కామెడీ మాములుగా ఉండదని  ఈ సీన్స్ హిలేరియస్ ఉంటాయని ఇన్సైడ్ టాక్.. అయితే ఇప్పటి వరకూ తన క్యారెక్టర్స్ తో సీరియస్ యాక్షన్ చేస్తూ ఎంటర్టైన్ చేసిన చరణ్ మొదటి సారిగా ‘రంగస్థలంలో’ కామెడి చేయబోతున్నాడన్నమాట. మరి చరణ్ కామెడి ఈ సినిమాకు ఏ రేంజ్ లో ప్లస్ అవ్తుందో చూడాలి.