ఒకరిది యుద్ధం.. మరొకరిది రొమాన్స్

Tuesday,September 27,2016 - 03:07 by Z_CLU

క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న బాలయ్య 100 వ చిత్రం “గౌతమీపుత్ర శాతకర్ణి” శరవేగంగా షూటింగ్ పనులు జరుపుకుంటుంది. అసలే బాలయ్య 100 వ చిత్రం కావడం, మరోవైపు చారిత్రాత్మక కథాంశంతో తెరకెక్కుతున్న సినిమా కావడంతో దర్శకుడు క్రిష్… సినిమాని తెరకెక్కించే విషయంలో ఏ మాత్రం కాంప్రమైజ్ అవ్వడం లేదు. సినిమాలోని కొంత టాకీపార్ట్ ని మధ్యప్రదేశ్ లో చిత్రీకరించి , సినిమాకే హైలెట్ గా నిలిచే యుద్ధ సన్నివేశాలను చిత్రీకరించడానికి మరోసారి జార్జియా వెళ్లబోతున్నారు. 12 జనవరి 2017 కల్లా సినిమాని రిలీజ్ చేసే టార్గెట్ తో… షూటింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

balakrishna-ram-charan-tej4
ఇదిలా ఉంటే రామ్ చరణ్ ‘ధృవ’ ఓ రెండు పాటలు, ఇంకో 6 రోజుల పాటు టాకీ తప్ప.. షూటింగ్ దాదాపు పూర్తయింది. సినిమాల విషయంలో ఫాస్ట్ అండ్ ఫ్యూరియాస్ గా ఉండే రామ్ చరణ్ ‘ధృవ’ షూటింగ్ దాదాపు పూర్తయినట్టే. మహా అయితే కొంత టాకీపార్ట్ పెండింగ్ లో ఉంది. అది కాస్త షెడ్యూల్ ప్రకారం ఇంకో 6 రోజుల్లో ప్యాకప్ అయిపోతుంది. కాకపోతే ఇక్కడ వెరీమచ్ ఇంటరెస్టింగ్ పాయింట్ ఏమిటంటే.. ఇంకా షూటింగ్ జరుపుకోవాల్సి ఉన్న రెండు పాటల విషయంలో మన చిరుత…. సింహ వెళ్ళిన దారినే ఎంచుకున్నాడు. యుద్ధం కోసం బాలయ్య జార్జియా వెళ్లబోతుంటే… పాటల షూటింగ్ కోసం చెర్రీ జార్జియా వెళ్లే ఆలోచనలో ఉన్నాడట.