చరణ్ ఫిక్స్ అయ్యాడా ..?

Tuesday,July 25,2017 - 07:08 by Z_CLU

ప్రెజెంట్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ ఎవైటింగ్ మూవీ ‘రంగస్థలం’లో నటిస్తున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సినిమా తర్వాత డైరెక్టర్ త్రినాధ్ రావు నక్కిన తో ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడనే టాక్ వినిపిస్తుంది. రీసెంట్ గా యూత్ ఫుల్ ఎంటర్టైనర్స్ తో సూపర్ హిట్స్ అందుకున్న త్రినాధ్ రావు ప్రెజెంట్ రామ్ చరణ్ కోసం ఓ కథను రెడీ చేయిస్తున్నాడని త్వరలోనే ఈ కాంబో సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

రీసెంట్ గా కొరటాల తో సినిమా అనౌన్స్ చేసిన చరణ్ కొరటాల-మహేష్ సినిమా పూర్తయ్యే లోపు ఓ సినిమా చేయాలనీ భావిస్తున్నాడని అది త్రినాధ్ రావు తోనే ఉండొచ్చని టాక్. ప్రెజెంట్ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ‘రంగస్థలం’ సినిమా ఓ కొలిక్కి రాగానే ఈ సినిమా మొదలు పెడతాడనే వార్త టాలీవుడ్ సర్కిల్స్ లో గట్టిగానే వినిపిస్తుంది. అన్ని కుదిరితే ఈ సినిమాను దిల్ రాజు నిర్మించే ఛాన్స్ ఉంది.