మెగాపవర్ స్టార్ కు 11 ఏళ్లు

Friday,September 28,2018 - 12:08 by Z_CLU

ఈరోజు మెగాభిమానులంతా పండగ చేసుకుంటున్నారు. వాళ్ల సెలబ్రేషన్ కు ఓ రీజన్ ఉంది. ఈరోజు మెగాస్టార్ వారసుడు హీరోగా ఎంట్రీ ఇచ్చిన రోజు. మెగావారసుడు బ్లాక్ బస్టర్ కొట్టిన రోజు. రామ్ చరణ్ ను మెగాపవర్ స్టార్ గా వెండితెరకు పరిచయం చేసిన రోజు.

పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వెండితెరకు పరిచయమయ్యాడు చెర్రీ. అతడు నటించిన చిరుత సినిమా సరిగ్గా ఇదే రోజున (సెప్టెంబర్ 28) థియేటర్లలోకి వచ్చి ఈరోజుకి 11 ఏళ్లు పూర్తిచేసుకుంది. అందుకే మెగాభిమానులు పండగ చేసుకుంటున్నారు.

చిరుత నుంచి నిన్నటి రంగస్థలం వరకు ప్రతి సినిమాకు నటుడిగా ఎదుగుతూనే ఉన్నాడు రామ్ చరణ్. మగధీర లాంటి చరిత్ర సృష్టించిన సినిమాతో పాటు మరెన్నో విజయాల్ని తన ఖాతాలో వేసుకున్నాడు. రీసెంట్ గా వచ్చిన రంగస్థలం సినిమా చరణ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ యాక్షన్ ఎంటర్ టైనర్ చేస్తున్నాడు.