చరణ్-బన్నీ మల్టీస్టారర్ ?

Sunday,April 23,2017 - 03:00 by Z_CLU

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్-స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కలిసి ఇప్పటికే ‘ఎవడు’ సినిమాతో అలరించారు.. ఈ సినిమాలో బన్నీ చేసింది గెస్ట్ రోల్ అయినప్పటికీ ఈ సినిమా మల్టీస్టారర్ గా మంచి గుర్తింపు అందుకుంది.. అయితే ఈ కాంబినేషన్ లో మరో మల్టీస్టారర్ సినిమా రెడీ అవుతుందనే వార్త టాలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది..

లేటెస్ట్ గా కన్నడ లో తెరకెక్కిన ‘బహద్దూర్’ అనే సినిమా చూసిన అల్లు అరవింద్ ఈ సినిమాను రామ్ చరణ్ బన్నీ లతో రీమేక్ చేయాలనీ చూస్తున్నాడట.. అయితే ఫుల్ ఫ్లెడ్జ్ హీరోగా చరణ్ ను అనుకుంటున్న అల్లు అరవింద్ పునీత్ రాజ్ కుమార్ చేసిన స్పెషల్ బన్నీ తో చేయించాలని చూస్తున్నాడట.. ఇప్పటికే ఈ సినిమా కోసం గీత ఆర్ట్స్ బ్యానర్ పై ‘చరణ్-అర్జున్’ అనే టైటిల్ కూడా రిజిస్టర్ చేయించాడని వార్త వినిపిస్తుంది.. మరి ఈ మల్టీ స్టారర్ వార్త లో నిజం ఎంతో తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే..