లూసిఫర్ కు మెగా టచ్

Tuesday,May 26,2020 - 03:40 by Z_CLU

లూసిఫర్ స్క్రిప్ట్ కు మార్పుచేర్పులు
మెగాస్టార్ ఇమేజ్ కు తగ్గట్టు ఛేంజెస్
మలయాళంలో సూపర్ హిట్టయిన సినిమా లూసిఫర్. మోహన్ లాల్ నటించిన ఈ సినిమాను తెలుగులో మెగాస్టార్ రీమేక్ చేయబోతున్నారనే విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం చేస్తున్న ఆచార్య పూర్తయిన వెంటనే ఈ మూవీ సెట్స్ పైకి వస్తుంది.

ఈ రీమేక్ కు భారీ మార్పులు జరుగుతున్నాయని టాక్. మరీ ముఖ్యంగా మెగాస్టార్ ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకొని ఈ స్క్రిప్ట్ కు కొన్ని మెరుగులు దిద్దుతున్నాడట దర్శకుడు సుజీత్. హీరోయిజం ఎలివేట్ చేయడంలో సుజీత్ తనకంటూ ఓ సెపరేట్ మార్క్ క్రియేట్ చేసుకున్నాడు. లూసిఫర్ కు కూడా తనదైన స్టయిల్ లో చిరు కోసం కొన్ని యాడ్ చేశాడట.

అనుకున్న మార్పులు చేసి ఫైనల్ వెర్షన్ మెగాస్టార్ కి, చరణ్ కి వినిపించడానికి రెడీగా ఉన్నాడట సుజీత్. అంతేకాదు, ఆ మార్పులు పాన్ ఇండియా లెవల్ లో చేసినట్టు తెలుస్తుంది.