వెండితెరపై తిరుగులేని చిత్రం

Tuesday,August 28,2018 - 12:51 by Z_CLU

భానుమతిని పవర్ ఫుల్ లేడీ ఆఫ్ సిల్వర్ స్క్రీన్ అని ఎందుకంటారో తెలుసా? ఆమెను అంతా ఆల్-రౌండర్ అని ఎందుకు కీర్తిస్తారో తెలుసా? వీటికి సమాధానం తెలియాలంటే చండీరాణి సినిమా గురించి తెలుసుకోవాలి.

తెలుగులోనే కాదు, భారతదేశంలోనే ఓ మహిళ డైరక్ట్ చేసిన తొలి చిత్రంగా చరిత్ర సృష్టించింది చండీరాణి. అన్నీ పురుషులే ఎందుకు చేయాలి, మహిళలకు ఏం తక్కువ అనే ఉద్దేశంతో భానుమతి తీసిన సినిమా ఇది. ఈ సినిమాను ఒకేసారి తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తీశారు భానుమతి.

చండీరాణి సినిమాను భానుమతి డైరక్ట్ చేయడమే కాకుండా, తన భర్త రామకృష్ణ పేరు మీద దీన్ని నిర్మించారు కూడా. అంతేకాదు, ఇందులో ఆమె నటించారు, పాటలు కూడా పాడారు. అలా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన చండీరాణి సినిమా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో వంద ప్రింట్లతో ఒకేసారి విడుదలై సూపర్ హిట్ అయింది.

1953లో సరిగ్గా ఇదే రోజున (ఆగస్ట్ 28) విడుదలైన ఈ సినిమా 65 ఏళ్లు పూర్తిచేసుకుంది.