ఛలో ట్రయిలర్ రివ్యూ

Thursday,January 18,2018 - 11:33 by Z_CLU

నాగశౌర్య హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఛలో. ఈ సినిమా ట్రయిలర్ ఈరోజు లాంఛ్ అయింది. త్రివిక్రమ్ దగ్గర అసిస్టెంట్ గా వర్క్ చేసిన వెంకీ కుడముల ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. నాగశౌర్య అమ్మానాన్న నిర్మాతలుగా మారి ఐరా క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మించారు.

ట్రయిలర్ పక్కాగా కామెడీ ట్రాక్ లోనే నడిచింది. తమిళనాడు-ఆంధ్ర బోర్డర్ లో, తమ తమ భాషలు, సినిమాలు, యాసలు, ఇతర వ్యవహారాలపై పట్టుగా వుండే రెండు వర్గాల మధ్య గొడవను ఫన్నీగా చూపించారు. ఇలా రెండు వర్గాలు, రెండు ఊళ్ల మధ్య నలిగిపోయే ప్రేమ జంట కథే ఈ ఛలో అనే విషయం ట్రయిలర్ చూస్తే అర్థమౌతోంది.

రష్మిక ఈ సినిమాతో తెలుగుతెరకు హీరోయిన్ గా పరిచయమౌతోంది. మణిశర్మ తనయుడు మహతి ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఇప్పటికే 2 పాటలు హిట్ అవ్వడం ఈ సినిమాకు పెద్ద అడ్వాంటేజ్. ఫిబ్రవరి 2న థియేటర్లలోకి రానుంది ఛలో మూవీ.