ఛలో మూవీ వారం రోజుల వసూళ్లు

Saturday,February 10,2018 - 01:02 by Z_CLU

కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ దిశగా దూసుకుపోతున్నాడు నాగశౌర్య. తన సొంత బ్యానర్ లో ఈ హీరో నటించిన ఛలో మూవీ ఫస్ట్ వీక్ కంప్లీట్ చేసుకొని, సక్సెస్ ఫుల్ గా రెండో వారంలోకి ఎంటరైంది. విడుదలైన 7 రోజుల్లో ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా 8 కోట్ల రూపాయల కలెక్షన్లు వచ్చాయి. నాగశౌర్య కెరీర్ లోనే అత్యథిక వసూళ్లు సాధించిన సినిమాగా ఇప్పటికే రికార్డు సృష్టించింది ఈ సినిమా.. లాంగ్ రన్ లో 15 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసే ఛాన్స్ ఉంది.

ఏపీ, నైజాం ఫస్ట్ వీక్ వసూళ్లు (షేర్)

నైజాం – రూ. 1.75 కోట్లు
సీడెడ్ – రూ. 0.75 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 0.92 కోట్లు
గుంటూరు – రూ. 0.54 కోట్లు
ఈస్ట్ – రూ. 0.54 కోట్లు
వెస్ట్ – రూ. 0.42 కోట్లు
కృష్ణా – రూ. 0.59 కోట్లు
నెల్లూరు – రూ. 0.22 కోట్లు

7 రోజుల మొత్తం షేర్ – రూ. 5.73 కోట్లు