దర్శకుడు కృష్ణ చైతన్య ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ

Wednesday,April 04,2018 - 10:55 by Z_CLU

చల్ మోహన్ రంగ ఈ నెల 5 న రిలీజవుతుంది. ఈ సినిమా డైరెక్టర్ కృష్ణ చైతన్య సినిమా సూపర్ హిట్ గ్యారంటీ అని కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. హిలేరియస్ ఎలిమెంట్స్ తో ఫన్ లోడెడ్ లవ్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా గురించి ఎక్స్ క్లూజివ్ గా చాలా విషయాలు షేర్ చేసుకున్నాడు కృష్ణ చైతన్య అవి మీకోసం…

 

‘రౌడీఫెలో’ తర్వాత ఇంత గ్యాప్…?

రౌడీఫెలో’ సినిమా తరవాత 2 ఇయర్స్ గ్యాప్ వచ్చింది. నిజానికి ఈ సినిమా ఇంకో 6 నెలలు ముందుగానే సెట్స్ పైకి వచ్చేయాలి కానీ, నితిన్ ‘లై’ సినిమాతో బిజీగా ఉండేసరికి ఆగాల్సి వచ్చింది.

 

ఫస్ట్ ఫోన్ కాల్ తనదే...

‘రౌడీఫెలో’ రిలీజ్ తరవాత నాకు వచ్చిన ఫస్ట్ కాల్ నితిన్ నుండే. అదే రోజు చెప్పాడు. స్క్రిప్ట్ రెడీ చేసుకో.. సినిమా చేద్దాం అని.

 

వేరే స్క్రిప్ట్ అనుకున్నాం…

నితిన్ తో సినిమా అనగానే వేరే స్క్రిప్ట్ రెడీ చేసుకున్నాను. స్పోర్ట్స్ ఎంటర్ టైనర్ చేయాలనుకున్నాను. కానీ ఎందుకో మళ్ళీ నాకు ఆ స్క్రిప్ట్ పై డౌట్ వచ్చి, డెసిషన్ మార్చుకున్నాను.

అలా జరిగింది…

‘రౌడీఫెలో’ సినిమా తరవాత త్రివిక్రమ్ గారిని కలిసినప్పుడు దాదాపు 5 గంటలు ఆ సినిమా గురించే మాట్లాడారు. ఆ తరవాత ‘చైతు మీకు అభ్యంతరం లేకపోతే కలిసి పని చేద్దామా’ అని అడిగారు. ‘అభ్యంతరం ఉండటం ఏంటి..? గ్రేట్ హానర్ సర్..’ అన్నాను, అలా మొదలైంది.

మామూలు ఫీలింగ్ కాదది…

సినిమా బిగిన్ కాకముందే ఈ జర్నీలో త్రివిక్రమ్ గారున్నారు కానీ పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ సినిమాని రిలీజ్ చేయడం అన్నది మాటల్లో చెప్పలేని ఫీలింగ్ నాకు. ఒకరోజు నేను కారు డ్రైవ్ చేస్తుంటే కారు పక్కన ఆపి మరీ చెప్పాడు నితిన్. మామూలు ఫీలింగ్ కాదది. ఆయన బ్యానర్ లో ఫస్ట్ సినిమా చేయడం నిజంగా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను.

 

అందుకే నేను రాయలేదు…

ఈ స్టోరీతో నేను 1 ఇయర్ గా ట్రావెల్ చేస్తున్నాను. ఒకవేళ ఈ సినిమా సాంగ్స్ మళ్ళీ నేనే రాసుకుంటే నా పర్సెప్షనే ఉంటుంది. అదే కథతో ఇప్పటి వరకు సంబంధం లేకుండా, కొత్తవాళ్ళు ఇన్వాల్వ్ అయితే, కొత్త పర్సెప్షన్ ఉంటుంది. అది డెఫ్ఫినేట్ గా సినిమాకు ప్లస్ అవుతుంది. అందుకే ఈ సినిమాకి సాంగ్స్  నేను రాయలేదు.

 

బ్యూటిఫుల్…

‘వారం’ సాంగ్ సినిమాలో 5 వ సాంగ్, మంచి బ్యూటిఫుల్ సిచ్యువేషన్ లో ఉంటుంది. ఇక ‘పెద్దపులి’ సాంగ్ ఒరిజినాలిటీ పోకుండా, సాహితి గారు తమన్ గారు ఇంకా బ్యూటిఫుల్ గా రెండర్ చేశారు.

 

చాలా మంది అప్రీషియేట్  చేశారు…

ఈ సినిమా టీజర్ రిలీజయ్యాక అల్లు అర్జున్ గారు మెసేజ్ చేశారు. నారా రోహిత్, హరీష్ శంకర్, హను రాఘవపూడి గారు ఇలా చాలా మంది బావుందని అప్రీషియేట్ చేశారు.

 

దేనికదే…

లిరిసిస్ట్ గా అయినా, డైరెక్టర్ గా ఆయినా దేనికష్టం దానిదే.

 

ఇద్దరి కెమిస్ట్రీ అదుర్స్…

సినిమాలో నితిన్, మేఘా ఆకాష్ కెమిస్ట్రీ న్యాచురల్ గా కుదిరింది. వాళ్ళిద్దరికీ ఇది 2 వ సినిమా అవడం కూడా ఒక  రీజన్ అయినా, కొత్త వాళ్ళు కూడా ఒక సిచ్యువేషన్ పర్ఫామ్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్ గా కనెక్టివిటీ ఉంటుంది. అదే ఈ ఇద్దరి విషయంలోనూ జరిగింది. ఇద్దరూ చాలా బాగా పర్ఫామ్ చేశారు.

చాలా ఈజీ అయింది…

త్రివిక్రమ్ గారు, పవన్ కళ్యాణ్ గారు బిజీ కాబట్టి మ్యాగ్జిమం సుధాకర్ రెడ్డి గారు, నిఖిత గారే చూసుకునేవారు. ఆయన సీనియర్ ప్రొడ్యూసర్ కాబట్టి, ఆయన ఎక్స్ పీరియన్స్ మాకు చాలా హెల్ప్  అయింది. ప్రొడక్షన్ ప్లానింగ్ దగ్గర్నించి ప్రతీది వాళ్ళ వల్లే ఈజీ అయింది.

 

లొకేషన్స్ అవే…

న్యూయార్క్, న్యూజెర్సీ, మయామి, కీవెస్ట్ తో పాటు ఇండియాలో కున్నూరు, హైదరాబాద్ లో చేశాం.

 

కామెడీ ట్రాక్ ఉండదు…

సినిమా కథే సరదాగా సాగుతూ ఉంటుంది. స్టోరీ లోనే ఇంటర్నల్ గా కామెడీ ఉంటుంది. సినిమాలో పర్టికులర్ గా కామెడీ ట్రాక్ ఏమీ ఉండదు.

 

మధునందన్, బన్ని సాయి క్యారెక్టర్స్…

మధు U.S. లో నితిన్ ఫ్రెండ్. పమ్మి సాయి ఇండియాలో నితిన్ ఫ్రెండ్ గా చాలా బాగా నటించారు.

 

నాకలాంటి ఫీలింగ్స్ ఉండవు…

పవన్ కళ్యాన్ గారు త్రివిక్రమ్ గారి ఆలోచన అసలు పనిచేసేటప్పుడు నాకుండదు.ఎవరైనా పర్టికులర్ గా ఆడుగుతున్నప్పుడే, ఇంత పెద్ద పేర్లు సినిమాతో ఎటాచ్ అయి ఉన్నాయన్న ఆలోచన వస్తుంది కానీ, నేను ప్రెజర్ అనే బ్యాగేజ్ ని ఎప్పుడూ క్యారీ చేయను.

మూవీ హైలెట్స్…

నితిన్ ఇంత ఫుల్ లెంత్ సరదా మూవీ ఇంత వరకు చేయలేదు. నట్టు గారి విజువల్స్, తమన్ మ్యూజిక్ ప్రతీది సినిమాలో హైలెట్ అవుతుంది.

 

అసిస్టెంట్ డైరెక్టర్ గా…

‘రౌడీఫెలో’ సినిమా చేశాక కూడా సాంగ్స్ రాశాను. సాంగ్స్ రాయడం వచ్చు కాబట్టి రాస్తున్నాను. కానీ అసిస్టెంట్ డైరెక్టర్ గా చాలా సినిమాలకు చేశాను. యువత, సోలో, స్వామి రారా, ఆంజనేయులు, బాణం సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా చేశాను. సుధీర్ నా లాస్ట్ డైరెక్టర్.

 

చివరిగా…

ఏ పనైనా హానెస్ట్ గా, నిజాయితీగా చేస్తే దానికి పంచి రిసెప్షన్ ఉంటుంది. ‘రౌడీఫెలో’ కూడా అలాగే అనుకుని చేశాను. ఆ సినిమా నాకు త్రివిక్రమ్ గారు, పవన్ కళ్యాణ్ లాంటి పెద్దవాళ్ళను ఇచ్చింది. ఈ సినిమా కూడా అంతే అనుకుంటున్నాను.