చైతు కి అదే దిగులు...

Saturday,October 29,2016 - 01:25 by Z_CLU

టాలీవుడ్ ప్రేక్షకులను ఎప్పటి నుంచో  ఒక సినిమా ఇదిగో, అదిగో  అంటూ ఊరిస్తుంది. ఆ సినిమా మరేదో కాదు అక్కినేని యువ కథానాయకుడు నాగచైతన్య నటించిన ‘సాహసం శ్వాసగా సాగిపో’. ఈ సినిమా షూటింగ్ పూర్తయి చాలా నెలలే గడుస్తున్నా ఇంత వరకూ విడుదల తేదీని ప్రకటించలేకపోతున్నారు యూనిట్. ఇక ఇటీవలే ప్రేమమ్ తో విజయం అందుకున్న చైతు ను కూడా ఈ సినిమా కలవరపరుస్తోంది. ఇటీవలే ఈ సినిమాపై చైతు స్పందిస్తూ తెలుగు షూట్ ఎప్పుడో అయిపోయిందని తమిళ్ వల్లే లేట్ అవుతుందని.కానీ ఆ సినిమా ఎప్పుడొచ్చినా విజయం సాధిస్తుందని అంటున్నాడు.

ఇక మొన్నామధ్య అక్టోబర్ లోనే ఈ సినిమా విడుదల చేయనున్నట్లు సోషల్ మీడియా ద్వారా తెలిపాడు దర్శకుడు గౌతమ్ మీనన్. మళ్లీ ఆ డేట్ గురించి మరోసారి మాట్లాడలేదు. తాజాగా నవంబర్ లో ఈ సినిమాను  రిలీజ్ చెయ్యడానికి రెడీ అవుతున్నారనే టాక్ వినిపిస్తుంది. మరి నవంబర్ లో అయినా చైతు ఈ సినిమాతో సందడి చేస్తాడో? లేదో చూడాలి..