మరో సినిమాతో చైతూ

Friday,October 21,2016 - 05:18 by Z_CLU

ప్రేమమ్ తో రొమాంటిక్ హిట్ ని సొంతం చేసుకున్న నాగచైతన్య… ప్రేమమ్ ఇచ్చిన రొమాంటిక్ ఫీల్ నుండి బయట పడకముందే మరో రొమాంటిక్-యాక్షన్ ఎంటర్ టైనర్ తో రెడీ అవుతున్నాడు. గౌతంమీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన “సాహసం శ్వాసగా సాగిపో” ని వచ్చేనెలలో రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. సినిమా ఎనౌన్స్ చేసినప్పటి నుంచి విపరీతమైన హైప్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా… పాటల ద్వారా ఇప్పటికే హిట్ అయింది. రెహ్మాన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. నాగచైతన్య సరసన మంజిమా మోహన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తారు. ప్రేమమ్ లాంగ్ రన్ పూర్తయిన వెంటనే ఈ మూవీని థియేటర్లలోకి తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారు.