చైతూ సినిమా నవంబర్ 11న విడుదల

Friday,November 04,2016 - 08:24 by Z_CLU

యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య, మంజిమ మోహన్ జంటగా గౌతమ్‌ వాసుదేవ మీనన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న మరో లవ్ యాక్షన్ ఎంట‌ర్‌టైన‌ర్ ‘సాహసం శ్వాసగా సాగిపో`. మిర్యాల‌ స‌త్య‌నారాయ‌ణ రెడ్డి సమర్పణలో ద్వారకా క్రియేషన్స్‌ బేనర్‌పై రవీందర్‌రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుని యు/ఎ స‌ర్టిఫికేట్‌ పొందింది. ఏ మాయ చేసావే త‌ర్వాత నాగ‌చైత‌న్య‌, గౌత‌మ్‌మీన‌న్ కాంబినేష‌న్‌లో వ‌స్తున్న ఈ సినిమాను న‌వంబ‌ర్ 11న వ‌ర‌ల్డ్‌వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. ఓవ‌ర్‌సీస్‌లో ఈ చిత్రం ప్రణీత మీడియా ద్వారా ఓవ‌ర్‌సీస్‌లో విడుద‌ల‌వుతుంది. ఏఆర్ రెహ్మాన్ సంగీతం ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్. ప్రేమమ్ తర్వాత షార్ట్ గ్యాప్ లో నాగచైతన్య నుంచి వస్తున్నమూవీ ఇది. ఈ సినిమా తమిళ వెర్షన్ లో శింబు హీరోగా నటించాడు.