రారండోయ్ వేడుక చూద్దాం ఫస్ట్ లుక్

Wednesday,March 29,2017 - 10:22 by Z_CLU

నాగచైతన్య హీరోగా నటిస్తున్న కొత్త సినిమా రారండోయ్ వేడుక చూద్దాం. ఉగాది సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదలైంది. రొటీన్ గా ఒక స్టిల్ రిలీజ్ చేయకుండా,వెరైటీగా ఉంటుందని 2 స్టిల్స్ రిలీజ్ చేశారు. ఒకటి క్లాస్ లుక్, ఇంకోటి మాస్ లుక్.

నిజానికి ఇలా రెండు ఫస్ట్ లుక్స్ రిలీజ్ చేయడానికి కారణం నాగార్జున. కల్యాణ్ కృష్ణ-చైతూ కలిసి ట్రెడిషనల్ గా ఉండే ఈ లుక్ ఫిక్స్ చేశారు. కానీ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్న నాగార్జున మాత్రం చైతూ మాస్ లుక్ లో కనిపించే లుక్ ను సెలక్ట్ చేశారు. దీంతో రెండు లుక్స్ ను ఒకేేసారి విడుదల చేేశారు.

రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు కల్యాణ్ కృష్ణ దర్శకుడు. 50శాతం టాకీ పూర్తిచేసుకున్న ఈ సినిమాకు సంబంధించి త్వరలోనే మరో షెడ్యూల్ స్టార్ట్ కానుంది. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది.