చైతునే ఫస్ట్ ప్రయారిటీ – సమంతా

Wednesday,September 12,2018 - 10:06 by Z_CLU

ఈ నెల 13 న రిలీజవుతుంది సమంతా లీడ్ రోల్ ప్లే చేసిన ‘యూటర్న్’ మూవీ. అయితే అదే రోజున నాగ చైతన్య శైలజా రెడ్డి అల్లుడు కూడా రిలీజవుతుంది. 2 డిఫెరెంట్ జోనర్ సినిమాలే అయినా ఈ ఇద్దరి సినిమాలు ఒకే రోజున రిలీజవుతుండటంతో స్పెషల్ గా ఫీలవుతున్నారు అక్కినేని ఫ్యాన్స్. అయితే రీసెంట్ గా జరిగిన మీడియా ఇంటర్వ్యూలో ఒక ఇంట్రెస్టింగ్ స్టేట్ మెంట్ ఇచ్చింది.

‘మా ఇద్దరి సినిమాలు ఒకే రోజున రిలీజవుతుండటంతో కొంతమంది చై VS స్యామ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు కానీ, నా వరకు నా సక్సెస్ కన్నా చై సక్సెస్ చాలా ఇంపార్టెంట్. అన్నింటికన్నా నాకు చైతునే ఫస్ట్ ప్రయారిటీ’ అని చెప్పుకుంది.

ప్రస్తుతం ఎవరి సినిమా ప్రమోషన్స్ లో వాళ్ళు బిజీగా ఉన్నా, త్వరలో శివ నిర్వాణ డైరెక్షన్ లో సెట్స్ పైకి రానున్నారు ఈ మోస్ట్ హ్యాప్పెనింగ్ ఆఫ్ స్క్రీన్ కపుల్. షైన్ స్క్రీన్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ సినిమాకి నిర్మాతలు.