సూపర్ హిట్ కాంబో రిపీట్

Tuesday,May 02,2017 - 05:34 by Z_CLU

‘రారండోయ్ వేడుక చూద్దాం’ సినిమాకు సంబంధించి షూటింగ్ పూర్తిచేసిన నాగ చైతన్య ప్రస్తుతం కృష్ణ మరిముత్తు దర్శకత్వం లో తెరెక్కుతున్న సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.. ప్రెజెంట్ ఈ సినిమా సెట్స్ పై ఉండగానే మరో సినిమాను సెట్స్ పై పెట్టడానికి రెడీ అవుతున్నాడు..

లేటెస్ట్ గా ‘ప్రేమమ్’ తో కెరీర్ లో గ్రాండ్ హిట్ అందుకున్న చైతు మరో సారి ఈ సూపర్ హిట్ కాంబోను రిపీట్ చేయబోతున్నాడట.. ‘ప్రేమమ్’ రిలీజ్ టైంలో దర్శకుడు చందూ మొండేటి తో మరో సినిమా చేస్తానని అనౌన్స్ చేసిన చైతు చందు దర్శకత్వంలో మరో సారి నటించడానికి రెడీ అవుతున్నాడనే టాక్ వినిపిస్తుంది…

ఇటీవలే చైతు కోసం ఓ యాక్షన్ థ్రిల్లర్ కథ ను రెడీ చేసి చైతు కి వినిపించాడట ఈ డైరెక్టర్.. చందూ చెప్పిన కథ కి చైతు తో పాటు నాగార్జున కూడా ఇంప్రెస్ అయి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారనే వార్త వినిపిస్తుంది.. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్, రవి శంకర్, మోహన్ నిర్మించనున్నట్లు తెలుస్తుంది.. ఈ సినిమా తర్వాత నాగార్జున తో మరో సినిమాను తెరకెక్కించడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు చందూ..