వెంకీ రోల్ పై చైతూ క్లారిటీ

Sunday,September 16,2018 - 12:02 by Z_CLU

విక్టరీ వెంకటేష్ – యువ సామ్రాట్ నాగ చైతన్య కాంబినేషన్ లో తెరకెక్కనున్న సినిమా ఇటివలే గ్రాండ్ గా లాంచ్ అయిన సంగతి తెలిసిందే.. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజిలో ఉన్న ఈ సినిమాలో వెంకటేష్ క్యారెక్టర్ గురించి క్లారిటీ ఇచ్చాడు చైతూ..

సినిమాలో వెంకటేష్  ఓ అరగంట మాత్రమే కనిపిస్తాడన్న వార్తపై స్పందించాడు చైతూ …. ” సినిమాలో ఇద్దరి క్యారెక్టర్స్ సమానంగా ఉంటాయని.. వెంకటేష్ మావయ్య సినిమా అంతా ఉంటాడని చెప్పుకొచ్చాడు.. అక్టోబర్ నుండి సినిమా సెట్స్ పైకి రానుందని..  కమర్షియల్ ఎలిమెంట్స్ తో ఫన్నీ గా ఉంటుందని” తెలిపాడు.

బాబి డైరెక్షన్ లో యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందనున్న ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ , పీపుల్ మీడియా ఫాక్టరీ సంయుక్తంగా నిర్మించనున్నాయి.  థమన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నాడు.