అక్కడ కలుద్దాం అంటున్న చైతూ..

Saturday,December 17,2016 - 05:00 by Z_CLU

అక్కినేని ఫామిలీ నుంచి ఎవరో ఒకరు ఏదో ఓ సోషల్ ఎవేర్నెస్ క్యాంపైన్ ప్రోగ్రాం కి ఎటెండ్ అవ్వడం కామన్. ఈసారి చైతూ కూడా అలాంటి ఓ క్యాంపైన్ కి ఎటెండ్ అవ్వబోతున్నాడు.శ్రీ హర్ష అనే ఓ స్వచ్చంద సేవా సంస్థ రోడ్ సేఫ్టీ గురించి చెప్తూ స్టాప్ స్పీడ్ పేరుతో ఓ ర్యాలీ నిర్వహించబోతున్నారు. ఈ ర్యాలీ లో నాగ చైతన్య ఎటెండ్ అయి బైక్ డ్రైవ్ తో పాటు సేఫ్టీ రోడ్ డ్రైవింగ్, స్టాప్ స్పీడ్ టాపిక్ పై తన దైన స్టైల్ లో స్పీచ్ ఇవ్వబోతున్నాడు..

naga-chaitanya-ride-still

 

  స్టాప్ స్పీడ్ పేరుతో జరిగే ఈ ఈవెంట్ ఈ ఆదివారం నెక్ల్స్ రోడ్ లో ఉదయం 6 నుంచి 8 గంటల వరకూ జరగనుంది. సోషల్ ఎవేర్నెస్ పెంచేందుకు చేసే ఈ ప్రయత్నం లో అందరు భాగం అవ్వాలని ఈ ర్యాలీ లో అందరు నాతో కలిసి డ్రైవ్ చేస్తూ పార్టిసిపేట్ చేయాలని సోషల్ మీడియా ద్వారా ఫాన్స్ కు పిలుపునిచ్చాడు చైతూ.