సాహసం పెంచిన స్పీడ్

Tuesday,November 29,2016 - 01:10 by Z_CLU

సాహసం శ్వాసగా సాగిపో లాంటి సూపర్ హిట్ తరవాత స్పీడ్ తగ్గకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలకు సంతకాలు పెడుతున్నాడు నాగచైతన్య. నాగార్జునతో  ‘సోగ్గాడే చిన్ని నాయనా’ లాంటి కలర్ ఫుల్ ఎంటర్ టైనర్ ని తెరకెక్కించిన కళ్యాణ్ కృష్ణ సినిమాతో ఆల్ రెడీ సెట్స్ పై ఉన్న నాగచైతన్య రీసెంట్ గా, మోహన్ కృష్ణ ఇంద్రగంటి  సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు.

ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ కూడా అల్ రెడీ స్టార్ట్ అయిపోయింది. దీనికి సంబంధించిన  ఇన్ఫర్మేషన్ అయితే ప్రస్తుతానికి ఏదీ బయటికి రాలేదు కానీ, చైతు అకౌంట్ లో ఇంకో సినిమా పడింది అనే కన్ఫర్మేషన్ అక్కినేని ఫ్యాన్స్ లో ఇంకాస్త ఎగ్జైట్ మెంట్ ని పెంచేసింది.

 ‘మనమంతా’ సినిమాతో మంచి సినిమాల డైరెక్టర్ గా బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్న ‘చంద్రశేఖర్ యేలేటి’ సినిమాకు కూడా సంతకం చేసేశాడు చైతు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో, క్రేజీగా కరియర్ ని ప్లాన్ చేసుకుంటున్న నాగచైతన్య చూస్తుంటే SSS పెంచిన స్పీడ్ కి ఏ మాత్రం బ్రేక్ వేసేలా కనిపించడం లేదు.