మరో సెన్సేషన్ క్రియేట్ చేయనున్న ‘చదరంగం’

Tuesday,January 14,2020 - 10:02 by Z_CLU

మంచి విష్ణు నిర్మాతగా తెరకెక్కుతుంది ‘చదరంగం’. AP పాలిటిక్స్ లోని రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ వెబ్ సిరీస్ లో హీరో శ్రీకాంత్ లీడ్ రోల్ ప్లే చేస్తున్నాడు. ఫిబ్రవరి 20 న ZEE5 లో రిలీజవుతున్న ‘చదరంగం’ అప్పుడే ఆడియెన్స్ లో క్యూరియాసిటీ జెనెరేట్ చేస్తుంది.

రీసెంట్ గా G.O.D. వెబ్ సిరీస్ కల్ట్ కంటెంట్ తో యూత్ నుండి మాస్ వరకు ఎట్రాక్ట్ చేసింది. ఇప్పుడు అదే బాటలో వరసగా వెబ్ సిరీస్ లను వరసగా లైనప్ ఉన్న ZEE 5, మరింత ఎట్రాక్టివ్ కంటెంట్ తో దూసుకుపోతుంది. G.O.D. తరహాలోనే ఈ ‘చదరంగం’ కూడా అదే స్థాయి సక్సెస్ అందుకుంటుందని కాన్ఫిడెంట్ గా ఉన్నాడు నిర్మాంత మంచు విష్ణు. రాజ్ అనంత డైరెక్షన్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది ఈ చదరంగం.

ఈ చదరంగం తో పాటు మరో 3 వెబ్ సిరీస్ లను అనౌన్స్ చేసింది ZEE5. లూజర్, ఎక్స్ పైరీ డేట్ తో పాటు అమృతం  ద్వితీయం అనే కొత్త వెబ్ సిరీస్ ని రిలీజ్ చేయనున్నారు. అల్టిమేట్ గా ఏ మాత్రం గ్యాప్ లేకుండా బ్యాక్ టు బ్యాక్ సిరీస్ లతో మెస్మరైజ్ చేస్తూ OTT ప్లాఫ్ ఫామ్ పై సత్తా చాటుతుంది ZEE5.