Chaavu Kaburu Challaga - సమ్మర్ రిలీజ్

Tuesday,January 12,2021 - 02:58 by Z_CLU

అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో ‌బన్నీ వాసు నిర్మాత‌గా.. ఎన‌ర్జిటిక్ యంగ్ హీరో కార్తికేయ‌, లావ‌ణ్య త్రిపాఠి జంట‌గా నూత‌న ద‌ర్శ‌కుడు కౌశిక్ పెగ‌ళ్ల‌పాటి తెర‌కెక్కిస్తున్న చిత్రం ‘చావు క‌బురు చ‌ల్ల‌గా’. ‌ఇప్పటికే విడుదలైన టైటిల్.. హీరో కార్తికేయ ‘బ‌స్తి బాల‌రాజు’ ఫ‌స్ట్ లుక్, ఇంట్రో అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది, ఆ త‌రువాత విడుద‌లైన క్యారెక్ట‌ర్ వీడియో, లావణ్య త్రిపాఠి ఫస్ట్ లుక్ కి కూడా అనూహ్య స్పంద‌న ల‌భించింది. ముఖ్యంగా కార్తికేయ గెట‌ప్‌, డైలాగ్ డెలివ‌రి మాడ్యూలేష‌న్ చూస్తే మ‌ళ్లీ చూడాల‌నిపించేలా ఉందంటూ కామెంట్స్ వ‌స్తున్నాయి. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన టీజర్ గ్లింప్స్ విడుద‌లైంది.

ద‌ర్శ‌కుడు కౌశిక్ పెగళ్ల‌పాటి అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకునే రీతిన ఈ చిత్రాన్ని సిద్ధం చేస్తున్నార‌నే విష‌యం ఇటీవ‌లే విడుద‌లైన బ‌స్తీ బాల‌రాజు క్యారెక్ట‌ర్ వీడియో ద్వారా అలానే తాజాగా వ‌చ్చిన టీజ‌ర్ గ్లింప్స్ ద్వారా స్ప‌ష్టం అవుతుంది.

Chaavu-Kaburu-Challaga-karthikeya-lavanya-tripathi

జిఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ లో “100% ల‌వ్”, “భ‌లేభ‌లే మ‌గాడివోయ్‌”, ” గీతగోవిందం”, “ప్ర‌తిరోజు పండ‌గే” చిత్రాలు ఘ‌న‌ విజాయాలు సాధించాయి. ఆ లెగ‌సినీ స‌క్సెస్ ఫుల్ గా చావుక‌బురుచ‌ల్ల‌గా ముందుకు తీసుకువెళుతుంద‌నే న‌మ్మ‌కంతో ఉన్నామ‌ని నిర్మాత బ‌న్నీవాసు తెలిపారు.

ఈ సినిమాను వేస‌విలో ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువ‌చ్చేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు.