Chaavu Kaburu Challaga - ఫస్ట్ గ్లింప్స్ అదిరింది

Monday,September 21,2020 - 04:46 by Z_CLU

అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో బ‌న్నీ వాసు నిర్మాత‌గా, హ్యాపెనింగ్ ఎన‌ర్జిటిక్ హీరో కార్తీకేయ‌, ల‌క్కీ బ్యూటీ లావ‌ణ్య త్రిపాఠి జంట‌గా నూత‌న ద‌ర్శ‌కుడు కౌశిక్ పెగ‌ళ్ల‌పాటి తెర‌కెక్కిస్తున్న చిత్రం “చావుక‌బురుచ‌ల్ల‌గా”.(Chaavu Kaburu Challaga)

ఈ సినిమాలో బస్తీ బాలరాజుగా కనిపించబోతున్నాడు Karthikeya. ఈ లుక్ ను ఇప్పటికే విడుదల చేసిన మేకర్స్, ఈరోజు కార్తికేయ బర్త్ డే సందర్భంగా టీజర్ రిలీజ్ చేశారు.

Chaavu Kaburu Challaga Teaser లో కార్తికేయ గెట‌ప్‌, డైలాగ్ డెలివ‌రి మాడ్యూలేష‌న్ చూస్తే మ‌ళ్ళి చూడాల‌నిపించేలా వుందంటూ కామెంట్స్ వ‌స్తున్నాయి. అంతే కాదు ఆమ‌ని, భ‌ద్రం వేసిన డైలాగ్స్ కూడా సామాన్య ప్రేక్ష‌కుల‌కి ద‌గ్గ‌ర‌గా వున్నాయి. టీజర్ లో హీరోయిన్ ను మాత్రం చూపించలేదు.

ఈ సినిమాకు సంబందించి మ‌రిన్ని స‌ర్‌ప్రైజ్ లు త్వ‌ర‌లో వ‌స్తాయంటున్నాడు నిర్మాత బన్నీ వాస్.

టెక్నీషియన్స్
స‌మ‌ర్ప‌ణ – అల్లు అర‌వింద్
బ్యాన‌ర్ – జీఏ2 పిక్చ‌ర్స్
నిర్మాత – బ‌న్నీ వాసు
ఎడిట‌ర్‌– స‌త్య జి
ఆర్ట్‌– జి ఎమ్ శేఖ‌ర్‌
సినిమాటోగ్రాఫ‌ర్ – సునీల్ రెడ్డి
ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూస‌ర్స్‌.. శ‌ర‌త్ చంద్ర నాయిడు, రాఘ‌వ క‌రుటూరి
మ్యూజిక్ – జకీస్ బిజాయ్
ద‌ర్శకుడు – కౌశిక్ పెగ‌ళ్ల‌పాటి