'చావు కబురు చల్లగా' షూటింగ్ మొదలైంది !

Thursday,February 13,2020 - 04:27 by Z_CLU

కార్తికేయ హీరోగా  అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో జిఏ2  బ్యానర్ పై బ‌న్నివాసు నిర్మిస్తున్న ‘చావు కబురు చల్లగా’ సినిమా మొదలైంది.   కౌశిక్ పెగళ్లపాటి డైరెక్షన్ లో లావ‌ణ్య త్రిపాఠి హీరోయిన్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా  ఫిల్మ్‌న‌గ‌ర్ దైవ‌స‌న్నిధానంలో పూజాకార్య‌క్ర‌మాలతో ప్రారంభమైంది.  ఈ కార్య‌క్ర‌మంలో అల్లు అర‌వింద్ గారి మ‌న‌మ‌రాలు బేబి అన్విత క్లాప్ నివ్వ‌గా , స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ కుమారుడు అల్లు ఆయాన్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు.  మెద‌టి ద‌ర్శ‌క‌త్వ భాద్య‌త‌ని అల్లు అరవింద్ గారు నిర్వ‌హించారు. సినిమాలో హీరో కార్తికేయ బ‌స్తి బాలరాజు పాత్రలో కనిపించబోతున్నాడు.

ఈ సినిమాకు జేక్స్ బిజోయ్ సంగీతాన్ని అందిస్తున్నారు. అలాగే ప్ర‌ముఖ కెమెరామెన్ సునిల్ రెడ్డి సినిమాటొగ్ర‌ఫర్ గా పని చేస్తున్నారు, ఎడిట‌ర్ గా స‌త్య‌, ప్రోడ‌క్ష‌న్ డిజైన‌ర్ మ‌నీషా ఏ ద‌త్, ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూస‌ర్ గా రాఘ‌వ క‌రుటూరి లు బాద్య‌త‌లు నిర్వ‌హిస్తున్నారు. ఈనెల 19 నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనున్న ఈ సినిమాలో ఆమ‌ని, శ్రీకాంత్ అయ్యంగ‌ర్‌, మ‌హేష్‌, భ‌ద్రం త‌దిత‌రులు న‌టిస్తున్నారు.

నిర్మాణం : GA2 pictures
సమర్పణ : అల్లు అరవింద్
సంగీతం.. జేక్స్ బిజోయ్‌
కెమెరా.. సునీల్ రెడ్డి,
ప్రోడ‌క్ష‌న్ డిజైన‌ర్‌.. మ‌నీషా ఏ ద‌త్‌
ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూస‌ర్.. రాఘ‌వ క‌రుటూరి
ఎడిట‌ర్‌.. స‌త్య‌
పి ఆర్ ఒ.. ఏలూరు శ్రీను
నిర్మాత : బన్నీ వాసు
డైరెక్టర్ : కౌశిక్ పెగళ్లపాటి