సెలబ్స్ వాలంటైన్స్ డే స్పెషల్

Friday,February 15,2019 - 01:25 by Z_CLU

మూడేళ్లుగా ప్రేమించుకుంటున్న నయనతార, విఘ్నేష్ శివన్ కూడా వాలంటైన్స్ డే ను సెలబ్రేట్ చేసుకుంది. మంచి అకేషన్ దొరికితే విదేశాలకు వెళ్లి మరీ ఎంజాయ్ చేసే ఈ పెయిర్, ప్రేమికుల రోజున కూడా అదే పనిచేసింది. వీళ్లిద్దరూ కలిసి దిగిన పిక్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

బాలీవుడ్ హాట్ టాపిక్ గా మారిన రణబీర్ కపూర్, అలియాభట్ జంట వాలంటైన్స్ డే ను సంథింగ్ స్పెషల్ గా సెలబ్రేట్ చేసుకుంది. వీళ్లిద్దరూ డేటింగ్ లో ఉన్నారంటూ చాన్నాళ్లుగా పుకార్లు వినిపిస్తూనే ఉన్నాయి. అందుకే తగ్గట్టే వాలంటైన్స్ డే సందర్భంగా ఈ హాట్ కపుల్ ముంబయిలో హల్ చల్ చేసింది.

వాలంటైన్స్ డే నాడు కాబోయే భార్యతో కలిసి చెన్నై వీధుల్లో రౌండ్స్ కొట్టాడు హీరో విశాల్. హైదరాబాద్ కు చెందిన అనీషా రెడ్డిని ఈ హీరో త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడు. కాబోయే భార్యాభర్తలిద్దరూ ప్రేమికుల రోజును స్పెషల్ గా జరుపుకున్నారు.

ఇక హీరో ఆర్య సంగతి అందరికీ తెలిసిందే. ఈ ప్రేమికుల రోజునాడు తన ప్రేమను బయటపెట్టాడు. హీరోయిన్ సాయేషాను వచ్చేనెలలో పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రకటించాడు. ఇలా ఈ ఏడాది వాలంటైన్స్ డే ను కొందరు సెలబ్ కపుల్స్ సంథింగ్ స్పెషల్ గా సెలబ్రేట్ చేసుకున్నారు.