ఆ సినిమాలో కేథరిన్ స్పెషల్ సాంగ్...

Thursday,March 16,2017 - 09:30 by Z_CLU

లేటెస్ట్ గా ‘సరైనోడు’ సినిమాలో అల్లు అర్జున్ సరసన మెరిసిన కేథరిన్ త్వరలో స్పెషల్ సాంగ్ తో ఎంటర్టైన్ చేయబోతుంది.. బోయపాటి దర్శకత్వంలో బెల్లం కొండ శ్రీనివాస్ హీరో గా రూపొందుతున్న సినిమాలో శ్రీనివాస్ తో కలిసి ఓ స్పెషల్ సాంగ్ లో హాట్ స్టెప్స్ వేసేందుకు రెడీ అవుతుంది..


ప్రస్తుతం హైదరాబాద్ లో వేసిన భారీ సెట్లో ఈ సాంగ్ ని షూట్ చేస్తున్నారు యూనిట్. దేవి శ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన ఈ సాంగ్ సినిమాకు ఓ స్పెషల్ ఎట్రాక్షన్ కానుందట.ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాలో సాయిశ్రీనివాస్ సరసన రకుల్ ప్రీత్ సింగ్, ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు..