రామ్ చరణ్ సరసన బన్నీ బ్యూటీ

Thursday,November 29,2018 - 11:08 by Z_CLU

బోయపాటి శ్రీను దర్శకత్వంలో వినయ విధేయ రామ అనే సినిమా చేస్తున్నాడు రామ్ చరణ్. ఒక్క సాంగ్ మినహా ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయింది. మిగిలిన ఆ ఒక్క ఐటెంసాంగ్ షూటింగ్ ను డిసెంబర్ 10 నుంచి ప్రారంభించబోతున్నారు. ఈ సాంగ్ కోసం క్యాథరీన్ థ్రెసాను ఆల్ మోస్ట్ ఫిక్స్ చేశారు. గతంలో బన్నీ నటించిన ఇద్దరమ్మాయిలతో సినిమాతో క్రేజ్ తెచ్చుకుంది క్యాథరీన్.

నిజానికి ఈ స్పెషల్ సాంగ్ కోసం ఇలియానాను సంప్రదించారు మేకర్స్. కానీ ఆమె భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేసిందట. ఆ తర్వాత రకుల్ లాంటి హీరోయిన్ల పేర్లు తెరపైకొచ్చినప్పటికీ, ఫైనల్ గా క్యాథరీన్ కు ఆ ఛాన్స్ దక్కింది.

క్యాథరీన్ కు స్పెషల్ సాంగ్స్ కొత్తకాదు. గతంలో బోయపాటి తీసిన జయజానకి నాయక సినిమాలో ఈమె ఓ ఐటెంసాంగ్ చేసింది. ఇప్పుడు మళ్లీ అదే దర్శకుడి సినిమాలో మెరవనుంది. చరణ్ సినిమాలో క్యాథరీన్ కనిపించడం మాత్రం ఇదే ఫస్ట్ టైమ్. తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.