విజయ్ దేవరకొండ సరసన క్యాథరీన్

Saturday,January 12,2019 - 10:35 by Z_CLU

ఎట్టకేలకు మరో గోల్డెన్ ఛాన్స్ దక్కించుకుంది క్యాథరీన్ త్రెసా. అన్నీ అనుకున్నట్టు జరిగితే విజయ్ దేవరకొండ సరసన త్వరలోనే ఈ బ్యూటీ నటించనుంది. ఈ మేరకు ప్రస్తుతం డిస్కషన్స్ స్టార్ట్ అయ్యాయి.

డియర్ కామ్రేడ్ అనే సినిమా చేస్తున్నాడు విజయ్ దేవరకొండ. ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ అయిన వెంటనే క్రాంతి మాధవ్ దర్శకత్వంలో ఓ రొమాంటిక్ ఎంటర్ టైనర్ ను సెట్స్ పైకి తీసుకురాబోతున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా క్యాథరీన్ పేరును పరిశీలిస్తున్నారు.

గతంలో బన్నీ నటించిన సరైనోడు, ఇద్దరమ్మాయిలతో సినిమాల్లో నటించింది క్యాథరీన్. రీసెంట్ గా కాస్త గ్యాప్ తీసుకున్న ఈ బ్యూటీ, త్వరలోనే విజయ్ దేవరకొండ సరసన మెరవనుంది.