బన్నీ సరసన వరుసగా నాలుగో సారి!

Saturday,March 02,2019 - 02:30 by Z_CLU

బన్నీ, క్యాథరీన్ పెయిర్ బాగుంటుంది. సరైనోడు సినిమాలో వీళ్లిద్దరి జోడీకి మంచి మార్కులు పడ్డాయి. ఇప్పుడీ బ్యూటీని మరోసారి రిపీట్ చేయబోతున్నాడట అల్లు అర్జున్. అన్నీ అనుకున్నట్టు జరిగితే, త్రివిక్రమ్-బన్నీ అప్ కమింగ్ మూవీలో క్యాథరీన్ మెరవబోతోంది.

అయితే ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది. ఈ సినిమాలో క్యాథరీన్ మెయిన్ హీరోయిన్ కాదు. సెకెండ్ హీరోయిన్ లీడ్ కోసం ఆమెను తీసుకున్నారు. మెయిన్ హీరోయిన్ ఎవరనేది ఇంకా ఫిక్స్ చేయలేదు. ప్రస్తుతానికైతే రూమర్స్ అన్నీ పూజా హెగ్డే చుట్టూ తిరుగుతున్నాయి.

గీతాఆర్ట్స్, హారిక-హాసిని బ్యానర్లపై రాబోతున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం ఈనెలలోనే సెట్స్ పైకి రానుంది. తమన్ ఈ సినిమాకు సంగీతం అందించబోతున్నాడు.