అసురన్ కాస్టింగ్ కాల్

Thursday,November 28,2019 - 04:54 by Z_CLU

వెంకీమామ తర్వాత అసురన్ రీమేక్ చేయబోతున్నాడు వెంకటేష్. శ్రీకాంత్ అడ్డాల దర్శకుడు. ఈ విషయాన్ని ఇంకా అఫీషియల్ గా ఎనౌన్స్ చేయలేదు. ఇప్పుడీ ప్రాజెక్టుకు సంబంధించి కాస్టింగ్ కాల్ వచ్చింది. వెంకీతో కలిసి నటించే అద్భుతమైన అవకాశం ఇది.

14 ఏళ్ల నుంచి 55 ఏళ్ల మధ్య వయసున్న వ్యక్తులంతా ఈ కాస్టింగ్ కాల్ లో పాల్గొనవచ్చు. దాదాపు 10 మంది వరకు కొత్త నటీనటుల్ని ఎంపిక చేయబోతున్నారు. ఈ ప్రాసెస్ పూర్తయిన తర్వాత ఫిమేల్ ఆర్టిస్టుల కోసం మరో కాస్టింగ్ కాల్ ప్రకటన ఇచ్చే ఛాన్స్ ఉంది.

ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రియను తీసుకున్నారంటూ ఇప్పటికే గాసిప్స్ వస్తున్నాయి. వెంకీమామ రిలీజ్ తర్వాత, అసురన్ పై మరింత క్లారిటీ వస్తుంది. తెలుగులో ఈ సినిమాకు అసురుడు అనే టైటిల్ అనుకుంటున్నారు. సురేష్ బాబు నిర్మాత.