పూజాహెగ్డేకి అంత సీనుందా...?

Tuesday,September 17,2019 - 01:02 by Z_CLU

రీమిక్స్ సాంగ్స్ టాలీవుడ్ లో కొత్తేం కాదు. ఇలా చేయడం వల్ల క్లాసిక్ సాంగ్స్ యూత్ కి మరింత దగ్గరవుతాయి. సదరు సినిమాకి మంచి మైలేజ్ కూడా వస్తుంది. వాల్మీకి విషయంలో కూడా జరిగిందదే. ‘వెల్లువొచ్చి గోదారమ్మ’ సాంగ్ ఈ సినిమాలో ఉండబోతుందని తెలిసిన మూమెంట్, మెగా ఫ్యాన్స్ లో వైబ్రేషన్స్ క్రియేట్ అయ్యాయి. సినిమాలో ఈ సాంగ్ ని ఎలా పిక్చరైజ్ చేస్తారో సిల్వర్ స్క్రీన్ పై చూసేయాలన్న క్యూరియాసిటీ జెనెరేట్ అయింది.

అయితే రీసెంట్ గా రిలీజ్ చేసిన ఈ సాంగ్ మేకింగ్ వీడియో మాత్రం సాంగ్ కన్నా ఎక్కువగా పూజా హెగ్డేని ఫోకస్ లోకి తీసుకు వస్తుంది. దానికి కారణం ఈ సాంగ్ పిక్చరైజేషన్ కోసం వాడిన ప్రాపర్టీ దగ్గరి నుండి పూజా హెగ్డే కాస్ట్యూమ్స్ వరకు ప్రతీది ఉన్నది ఉన్నట్టుగా దించేయడమే.

ఓ రకంగా చెప్పాలంటే ఈ సెటప్ అంతా శ్రీదేవిని గుర్తు చేస్తుంది. అంతవరకు ఓకె… కానీ పూజాహెగ్డే ని శ్రీదేవిలా ప్రెజెంట్ చేయాలని మేకర్స్ చేస్తున్న సాహసం వర్కవుట్ అవుతుందా..? పూజాహెగ్డే కి ఇప్పటికే యూత్ లో చెప్పలేనంత క్రేజ్ ఉంది. కానీ సీనియర్ నటి శ్రీదేవి తో కంపారిజన్స్ వచ్చినప్పుడు పూజా హెగ్డే నిలబడగలుగుతుందా..?

 

ఇప్పటివరకు జరిగిన రీమిక్స్ సాంగ్స్ అన్నీ, ఆడియో, పిక్చరైజేషన్ లో మాత్రం కంపారిజన్స్ చూపించాయి. ఉన్నంతలో మోడ్రనైజ్ చేసే ప్రయత్నాలు కూడా జరిగాయి. హరీష్ శంకర్ గతంలో చేసిన రీమిక్స్ సాంగ్ ‘గువ్వా గోరింక’ సాంగ్ కోసం మాడరన్ థీమ్ నే ఎంచుకున్నాడు. కానీ ఈ సాంగ్ వరకు వచ్చేసరికి మాత్రం, కేవలం సాంగ్ ను రీమిక్స్ చేయడమే కాకుండా.. పూజా హెగ్డేను శ్రీదేవిగా చూపించే ప్రయత్నం కూడా జరిగింది. మరి శ్రీదేవి లుక్స్, ఎక్స్ ప్రెషన్స్ ను పూజా హెగ్డే అందుకుందా అనేది డౌట్.