నయనతార లిస్టులో బాలయ్య ఉన్నాడా...?

Saturday,May 04,2019 - 10:02 by Z_CLU

ఈ మధ్య తెలుగులో సీనియర్ స్టార్స్ తో తప్ప… అందునా మరీ భారీ బడ్జెట్ సినిమాలైతే తప్ప పెద్దగా కన్సిడర్ చెయ్యట్లేదు నయనతార. అందుకే  అప్పుడెప్పుడో బాలయ్యతో ‘జై సింహా’ చేసి, ఇప్పటి వరకు జస్ట్ ‘సైరా’ కి మాత్రమే సంతకం చేసి సరిపెట్టుకుంది. చేస్తే ఫీమేల్ ఓరియంటెడ్ సినిమాలు లేకపోతే లిస్టెడ్ టాప్ హీరోస్ మాత్రమే అని రూల్ పెట్టుకున్న నయన్, ఇప్పుడు బాలయ్య సినిమాలో అవకాశం వస్తే చేస్తుందా..?

రీసెంట్ గా సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా ‘దర్బార్’ సెట్స్ పైకి వచ్చింది. ఈ సినిమాతో పాటు వరసగా ఈ ఏడాదిలోనే మరో 4 సినిమాలకు ఆల్రెడీ సంతకం చేసేసింది నయన్. ఈ బిజీ షెడ్యూల్స్ లో బాలయ్య సినిమాకోసం డేట్స్ సర్దడం అయ్యే పనేనా..?

ఇప్పటి వరకు 4 సినిమాల్లో బాలయ్య సరసన హీరోయిన్ గా చేసింది నయనతార. ఆ సినిమాలలో బాలయ్యకి  ఎంత హైప్ వచ్చిందో నయనతార పర్ఫామెన్స్ కి కూడా అంతే గుర్తింపు వచ్చింది. ఆ విషయం నయనతారకి కూడా తెలుసు కాబట్టి ‘నో’ అనడం కొంచెం కష్టమే.

ఇక ఆసలు విషయానికి వస్తే ఈ సినిమా టీమ్ నయనతారను అప్రోచ్ అయ్యారా లేదా అనేది అంత ఖచ్చితంగా చెప్పలేం కానీ, గతంలో ‘జై సింహా’ లో బాలయ్య సరసన నటించింది కాబట్టి, ఈసారి కూడా తనే అయితే బావుంటుందని ఫీలయ్యే అవకాశాలైతే ఉన్నాయి. మరీ నయన్ మనసులో ఏముందో.. ఇంకొన్నాళ్ళు ఆగితే గాని తెలీదు.