‘రణరంగం’ మళ్ళీ ఫామ్ లోకి తీసుకువస్తుందా...?

Wednesday,July 31,2019 - 11:03 by Z_CLU

‘పిల్లా పిక్చర్ పర్ఫెక్ట్..’ సాంగ్ కాజల్ అగర్వాల్ కరెక్ట్ గా సూటవుతుంది. సినిమాలో ఏ సందర్భంలో ఉంటుందనేది ఇప్పుడప్పుడే గెస్ చేయడం కష్టం కానీ, మేకర్స్ ప్రమోషన్స్ లో ఈ క్యారెక్టర్ కి ఇస్తున్న హైప్ చూస్తుంటే, సినిమాలో కీ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందన్న విషయం అర్థమవుతుంది. అంటే ఈ సినిమా మళ్ళీ కాజల్ అగర్వాల్ ఫామ్ లోకి తీసుకువస్తుందా..?

ఈజీగా రెండేళ్ళవుతుంది కాజల్ అగర్వాల్ హిట్టు కొట్టి. 2017 లో మెగాస్టార్ కమ్ బ్యాక్ మూవీ ‘ఖైదీ నం 150’ తరవాత అదే ఏడాది ‘నేనే రాజు నేనే మంత్రి’ తో సక్సెస్ అందుకున్న కాజల్ బాక్సాఫీస్ దగ్గర మళ్ళీ ఆ స్థాయిలో నిలబడలేకపోతుంది.

కాజల్ సినిమాల సెలెక్షన్ విషయంలో తడబడుతుందా..? లేకపోతే నిజంగానే కాజల్ కి ఆఫర్స్ తగ్గాయా..? అనేది ఖచ్చితంగా చెప్పలేం కానీ, ఈ రెండేళ్లలో కాజల్ కాస్త వెనకబడిందనేది మాత్రం వాస్తవం.

‘రణరంగం’ లో 1980 బ్యాక్ డ్రాప్ లో నడిచే కథలో కళ్యాణి ప్రియదర్శన్ ఉన్నా, ఆ తరవాత జరిగే న్యూ ఏజ్ డ్రామాలో కంప్లీట్ గ్లామర్ పోర్షన్ కాజల్ అగర్వాల్ చుట్టే నడుస్తుంది. అందునా శర్వా సినిమాలంటే మినిమం సక్సెస్ గ్యారంటీ… ఇన్ని పాజిటివిటీస్ మధ్య కాజల్ తన పర్ఫామెన్స్ కాస్త ఇంప్రెస్ చేసినా చాలు.. ‘రణరంగం’ కాజల్ కి కలిసొచ్చినట్టే…