ఇలియానాకి నో సెకండ్ ఛాన్స్..?

Monday,March 04,2019 - 10:03 by Z_CLU

ఆల్మోస్ట్ టాలీవుడ్ లో ఒక సీజన్ ని ఏలిన స్టార్ హీరోయిన్ ఇలియానా. ‘దేవదాస్’ తో పరిచయం అయినా, అదే సంవత్సరం రిలీజైన ‘పోకిరి’ తో సెన్సేషనే క్రియేట్ చేసింది. సాధారణంగా ఓ స్టార్ హీరో సినిమా లాంచ్ అయితే హీరోయిన్ ఎవరా అని ఆలోచిస్తారు..? కానీ ఆ రోజుల్లో హీరోయిన్  ఇలియానా అయితే బావుండు అనే స్థాయిలో డిమాండ్ క్రియేట్ చేసుకుంది ఈ గోవా బ్యూటీ. అయితే ఇప్పుడు మాత్రం  టోటల్ గా సిచ్యువేషన్  రివర్స్ గేర్ లో పడింది.

ఇలియానా కి బాలీవుడ్ పైనే మోజెక్కువ..? ఏ హీరోయిన్ కి ఉండదు…? ఈ రోజు టాప్ రేంజ్ లో ఉన్న రకుల్,   తమన్నా, కాజల్ లాంటి హీరోయిన్స్ కూడా  బాలీవుడ్ సినిమాలు చేసిన వాళ్ళే కదా. కానీ ఇలియానాకి వచ్చినంత గ్యాప్ మాత్రం రాలేదు. అసలేం జరిగి ఉంటుంది..?  ఇలియానాకి తెలుగులో  అవకాశాలే  రాలేదా..? లేకపోతే హిందీ సినిమాలతో బిజీగా ఉండిపోయి తెలుగు సినిమాలను  తనే అవాయిడ్ చేసిందా..?

 

 

రీసెంట్ గా ‘అమర్ అక్బర్ ఆంటోని’ లో ఇలాంటి క్వశ్చన్స్ రేజ్ చేస్తే, ‘నేను టాలీవుడ్ కి దూరమవ్వడమేంటి..? సరైన స్క్రిప్ట్ దొరక్కపోవడం వల్లే ఇంత గ్యాప్ వచ్చింది.. అంతే కానీ నేనెప్పుడూ తెలుగు సినిమాని అవాయిడ్ చేయలేదు’ అని క్లారిటీ కూడా ఇచ్చింది. అదే నిజమనుకుందాం. మరి నెక్స్ట్ సినిమా ఊసు ఇంకా వినిపించడం లేదేంటి..? కొంపదీసి ఈ సినిమా రిజల్ట్ ప్రభావం ఇలియానా తెలుగు సినిమా కరియర్ పై ప్రభావం  చూపించలేదు కదా…

తన గత సినిమాలతో పోలిస్తే కంప్లీట్ గా న్యూ లుక్ లో మెస్మరైజ్ చేసే ప్రయత్నం చేసింది ‘అమర్ అక్బర్ ఆంటోని’ లో.  ఇక నుండి కొత్త ఇలియానాను చూస్తారు అని ఫ్యూచర్ సినిమాల గురించి మరింత భరోసాగా మాట్లాడింది. కానీ  ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సరిగ్గా పర్ఫామ్ చేయకపోవడంతో, మళ్ళీ బ్యాక్ టు పొజిషన్ అన్నట్టు ఇలియానాకి, ఫ్యాన్స్ కి మధ్య క్రియేట్ అయిన గ్యాప్, గ్యాప్ లాగే మిగిలిపోయింది. ఈ పరిస్థితుల్లో ఇలియానాకి ఇంకో అవకాశం దొరుకుతుందా…? ఇప్పటికే  ఆల్రెడీ సినిమాలను సెట్స్ పైకి తీసుకువచ్చిన స్టార్  హీరోస్, ఇలియానా రాకని గమనించారా..? లేకపోతే లైట్ తీసుకున్నారా…? అనేది చూడాలి.