ఐశ్వర్య రాజేష్ – నిలబడుతుందా..?

Friday,August 23,2019 - 04:36 by Z_CLU

ఓవరాల్ గా పాజిటివ్ బజ్ క్రియేట్ చేస్తుంది ‘కౌసల్యా కృష్ణమూర్తి’ సినిమా. ఫీమేల్ సెంట్రిక్ సినిమానే అయినా మాస్ ఆడియెన్స్ కి కూడా ఈజీగా కనెక్ట్ అవుతుందీ ఈ స్పోర్ట్స్ బేస్డ్ ఎంటర్ టైనర్. అయితే ఈ సినిమా వరకు పర్వాలేదు ఆల్మోస్ట్ ట్రాక్ లో పడినట్టే… కానీ ఐశ్వర్యా రాజేష్ సంగతేంటి..?

న్యాచురల్ పర్ఫామర్ అని క్రిటిక్స్ నుండి కూడా అప్లాజ్ అందుకుంటున్న ఐశ్వర్యా… గ్లామరస్ హీరోయిన్ గా మాత్రం ఇంకా నిరూపించుకోవాల్సి ఉంది. ‘కౌసల్యా…’ కంప్లీట్ గా వేరు.. ఒక్క డ్యూయెట్ లేకపోయినా ఆడేస్తుంది… ఈ సినిమా కేవలం ఐశ్వర్యా ని బెస్ట్ పర్ఫామర్ గా మాత్రమే లాంచ్ చేసింది. కానీ కంప్లీట్ హీరోయిన్ మెటీరియల్ అనిపించుకోవడానికి ‘కౌసల్యా…’ సక్సెస్ ఏ మాత్రం సరిపోదు.

నిజానికి ఐశ్వర్యా రాజేష్ పరిచయం అవ్వాల్సింది విజయ్ దేవరకొండ సరసన… కానీ ఆ సినిమా ఆలస్యమవ్వడం, అంతలో తమిళంలో ‘కణ’ సక్సెసవ్వడం… ఈ లోపు ఈ సినిమా రీమేక్ ప్రాసెస్ బిగిన్ అవ్వడం… వీటి మధ్య బంతి, ఈ సినిమా బౌండరీలో పడింది.

ఇప్పటికే తమిళనాట సక్సెస్ ఫుల్ హీరోయిన్ అనిపించుకున్న ఈ తెలుగమ్మాయి, టాలీవుడ్ లో కూడా క్రేజీ హీరోయిన్ అనిపించుకుంటుందా..? లేదా..? అనేది ప్రస్తుతం సెట్స్ పై ఉన్న విజయ్ దేవరకొండ సినిమా రిలీజైతేనే   తేలుతుంది.