C. కళ్యాణ్ ఇంటర్వ్యూ

Wednesday,January 31,2018 - 03:20 by Z_CLU

సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన ‘ఇంటిలిజెంట్’ మూవీ టాలీవుడ్ లో పాజిటివ్ బజ్ క్రియేట్ చేస్తుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ ప్రమోషన్స్ ప్రాసెస్ స్పీడ్ పెంచిన సినిమా యూనిట్, సినిమా బ్లాక్ బస్టర్ గ్యారంటీ అని కాన్ఫిడెంట్ గా ఉంది. ఈ సందర్భంగా మీడియా తో మాట్లాడిన ప్రొడ్యూసర్ C. కళ్యాణ్ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నారు. అవి మీకోసం…. 

బాలయ్యకు థాంక్స్….

ఫిబ్రవరి 9 న రిలీజవుతున్న ఈ సినిమా టీజర్ ని బాలకృష్ణ గారు లాంచ్ చేశారు. అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ సందర్భంగా బాలకృష్ణ గారికి, వారి అభిమానులకు థాంక్స్…

ప్రభాస్ నా హీరో…

ప్రభాస్ ఫస్ట్ సినిమాలో నేను విలన్ గా నటించాను. అది నాకు మరిచిపోలేని అనుభూతి. ప్రభాస్ నా హీరో. ఆయన ఈ సినిమా సాంగ్స్ ని రిలీజ్ చేశారు. చాలా సంతోషంగా ఉంది.

అందరికీ ఆహ్వానం…

ఫిబ్రవరి 4 న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ రాజమండ్రి ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ లో చేస్తున్నాం. అందరినీ ఆహ్వానిస్తున్నాం.

అంతకు మించి….

మెగాస్టార్ 150 తరవాత వినాయక్ డైరెక్షన్ లో వస్తున్న సినిమా కాబట్టి అంచనాలు భారీగా ఉన్నాయి. ఆ అంచనాలకు మించి సినిమా ఎంటర్ టైన్ చేస్తుంది అందులో అనుమానం లేదు. సినిమా బిగిన్ అయినప్పటినుండి ఎప్పుడు కంప్లీట్ అయిందో కూడా తెలీనంతలా మైమరిపించే సినిమా ఇంటిలిజెంట్.

అద్భుతంగా చేశాడు…

తేజు సాంగ్స్ లో ఇరగదీశాడు. మెగాస్టార్ చిరంజీవి గారు బిగినింగ్ కరియర్ లో ఎంత ఫైర్ తో ఉండేవారో అంత ఫైర్ కనిపిస్తుంది తేజు డ్యాన్స్ లో. చాలా కష్టపడ్డాడు ఈ సినిమా కోసం…

కళామందిర్ సాంగ్….

సినిమాలో కళామందిర్ సారీ పై ఒక మంచి సాంగ్ ఉంది. అది ఈ రోజు సాయంత్రం కూకట్ పల్లిలోని కళామందిర్ షో రూమ్ లో రిలీజ్ చేస్తున్నాం. ఈ పాటతో అన్ని సాంగ్స్ రిలీజైనట్టే.

చమక్ చమక్ విజువల్…

ఫిబ్రవరి 4 న చమక్ చమక్ వీడియో సాంగ్ ఇళయరాజా మీదుగా లాంచ్  చేయబోతున్నాం. అద్భుతంగా జరగబోతుంది ఆ ఈవెంట్.

 

అసలు టెన్షన్ లేదు…

ప్రొడ్యూసర్స్ ని టార్చర్ పెట్టని టీమ్ తో పని చేస్తున్నాను. టెన్షన్ ఏముంటుంది. సినిమాలో చమక్ చమక్ సాంగ్  ‘ఓమన్’ లో షూట్ చేశాం. ఓమన్ లో చాలా సినిమాలు చేశారు కానీ, కానీ ఈ సినిమాలో ఒక సాంగ్, ఒక పర్టికులర్  లొకేషన్ లో చేశాం,  అక్కడ ఇప్పటి వరకు ఎవరూ షూటింగ్ చేయలేదు. ఎందుకంటే ఆ లొకేషన్ కి వెళ్ళాలంటే గంటన్నర హిల్స్ లో నడవాలి. అందుకే ఎవరూ రిస్క్ చేయలేదు. కానీ వినాయక్ ఏ మాత్రం కాంప్రమైజ్ కాకుండా  చేశాడు. చమక్ చమక్ సాంగ్ విజువల్స్ అన్ని సాంగ్స్ లో హైలెట్ గా నిలుస్తాయి.

సంక్రాంతికే రావాలి….

ఈ సినిమా సంక్రాంతికే రావాలి. కాకపోతే బాలయ్య ‘జై సింహా’ ఉందని ఈ సినిమాని ఇపుడు రిలీజ్ చేస్తున్నాం. వరుణ్ తేజ్ ‘తొలిప్రేమ’ రిలీజవుతుంది. అది కూడా ఆడాలి అనే కోరుకుంటున్నా. ఇది నా సినిమా కాబట్టి నాకు డబ్బులు ఎక్కువ రావాలి అని కోరుకుంటా(నవ్వుతూ..). రిలీజయిన ప్రతి సినిమా ఆడాలి. అప్పుడే ఇండస్ట్రీ బావుంటుంది.

 

అంతా న్యూమరాలజీ వల్లే…

నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా కరియర్ బిగిన్ చేసినప్పుడే నా పేరు 9 అక్షరాలూ ఉండేలా కుదించారు గురువు గారు దాసరి నారాయణ రావు గారు. అప్పటి నుండి న్యూమరాలజీని నమ్ముతున్నా. ఇప్పటికీ నమ్ముతా. నేను మీ ముందు ఇలా ఉన్నానంటే న్యూమరాలజీ వల్లే.

నెక్స్ట్ సినిమా….

ఈ ఇయర్ లో కొత్త డైరెక్టర్ తో సినిమా ఉంటుంది. తప్పకుండా నేషనల్ అవార్డ్ సినిమా అవుతుంది. ‘భారతి’ అనే టైటిల్ తో వస్తున్న ఈ సినిమా అందరినీ ఆలోచింపజేస్తుంది.

రానా సినిమా….

‘1945’ సినిమా ఇంకా 15 రోజుల షూటింగ్ బ్యాలన్స్ ఉంది. దానికోసం శ్రీలంక వెళ్ళాల్సి ఉంది. ఈ సినిమాతో రానాకి ఇంకా మంచి పేరు వస్తుంది.  సుభాష్ చంద్రబోసు బ్యాక్ డ్రాప్ లో అన్ని కమర్షియల్ తో పాటు బ్యూటిఫుల్ లవ్ ఎలిమెంట్స్ ఉన్న సినిమా. ఈ సినిమాలో రానా 2 షేడ్స్ లో కనిపిస్తాడు. ఈ సినిమా తరవాత మళ్ళీ వినాయక్ తో చేస్తా.