SSMB28 టైటిల్ చెప్పేది అప్పుడే ?

Wednesday,July 06,2022 - 12:21 by Z_CLU

Buzz : SSMB28 Title & first look on August 9th !

త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ హీరోగా నటించనున్న సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. ఆగస్ట్ మొదటి వారంలో సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం. అయితే ఎనౌన్స్ మెంట్ వచ్చి చాలా రోజులవుతున్నప్పటికీ ఇంకా సినిమా టైటిల్ ఎనౌన్స్ చేయలేదు మేకర్స్. ప్రస్తుతం #SSMB28 గానే ఈ సినిమా పిలవబడుతుంది.

తాజా సమాచారం మేరకూ ఈ సినిమా టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ ను మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆగస్ట్ 9న రిలీజ్ చేయబోతున్నారని తెలుస్తుంది. ఇటివలే టైటిల్ లాక్ చేసి త్రివిక్రమ్ ఓ స్పెషల్ డిజైన్ చేయిస్తున్నారని టాక్ వినిపిస్తుంది. నిజానికి మహేష్ బర్త్ డే రోజు ఫ్యాన్స్ కచ్చితంగా నెక్స్ట్ సినిమా ఫస్ట్ లుక్ ఎక్స్ పెక్ట్ చేస్తారు. కానీ సినిమా షూటింగ్ ఇంకా మొదలు కాలేదు కాబట్టి టైటిల్ పోస్టర్ వదిలే అవకాశం ఉంది. మరి చూడాలి త్రివిక్రమ్ అండ్ టీం మహేష్ కి ఎలా విషెస్ చెప్తారో ?

హారికా హాసినీ క్రియేషన్స్ బేనర్ పై రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాలో మహేష్ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటించనుంది. సెకండ్ హీరోయిన్ కూడా ఉండనుంది. ఆమె ఎవరనేది ఇంకా అఫీషియల్ గా చెప్పలేదు. తమన్ ఈ సినిమాకు మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.

 

  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics