బిజీ బిజీ శర్వానంద్

Tuesday,May 23,2017 - 02:56 by Z_CLU

శర్వానంద్ తన నెక్స్ట్ సినిమాతో సెట్స్ పైకి వచ్చేశాడు. మారుతి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ‘మహానుభావుడు’ సినిమాతో మళ్ళీ బిజీ బిజీ అయిపోయాడు. ఇయర్ బిగినింగ్ లోనే ‘శతమానం భవతి’ తో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ని బ్యాగ్ లో వేసుకున్న శర్వా, ఇమ్మీడియట్ గా ‘రాధ’, ఆ తరవాత ఇప్పుడు ‘మహానుభావుడు’ బ్యాక్ టు బ్యాక్ వెంచర్స్ తో 2017 ని సక్సెస్ ఫుల్ గా ప్లాన్ చేసుకుంటున్నాడు.

‘బాబు బంగారం’ సినిమా తరవాత మళ్ళీ అదే తరహా ఎంటర్ టైన్డ్ కాన్సెప్ట్ తో రెడీ అయిపోయిన మారుతి, ఈ ‘మహానుభావుడు’ బ్లాక్ బస్టర్ గ్యారంటీ అని కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఎంటర్ టైన్ మెంట్ కి స్కోప్ ఉన్న వెంచర్స్ ని చూజ్ చేసుకుంటూ కరియర్ ని ప్లాన్ చేసుకుంటున్న శర్వానంద్, ఈ సినిమాలో సరికొత్తగా కనిపించనున్నాడని టాక్. మెహరీన్ కౌర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా UV క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కుతుంది.