బిజీబిజీ దేవి శ్రీ ప్రసాద్

Friday,April 07,2017 - 09:02 by Z_CLU

దేవి శ్రీ ప్రసాద్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ టూర్ కి ఆల్ సెట్ అయింది. ఈ టూర్ కి సంబంధించిన టీజర్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న హాట్టెస్ట్ ఎలిమెంట్. సిడ్నీలో మే 27 న, మెల్ బోర్న్ లో జూన్ 3 న, బ్రిస్ బేన్ లో జూన్ 10 న, ఓక్ లాండ్ లో జూన్ 17 న జరగనున్న ఈ టూర్ న్యూజిలాండ్, ఆస్ట్రేలియా లోని DSP ఫ్యాన్స్ లో రూలు గడుస్తున్న కొద్దీ సరికొత్త ఇంట్రెస్ట్ ని జెనెరేట్ చేస్తుంది.

టూర్ తో పాటు ఇండస్ట్రీ లో ఛోటా బడా ని తేడా లేకుండా మ్యాగ్జిమం అందరు స్టార్స్ తో కలిసి పని చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్న దేవి శ్రీ ప్రసాద్, చేతి నిండా సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న దువ్వాడ జగన్నాథం తో బిగిన్ తో అయితే,  రామ్ చరణ్- సుకుమార్ సినిమా, NTR జై లవకుశ, రామ్ – కిషోర్ తిరుమల సినిమా, నాగ చైతన్య రారండోయ్ వేడుక చూద్దాం, మహేష్ బాబు- కొరటాల కాంబో కి కూడా దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజర్.

జస్ట్ ట్యూన్స్ ఇచ్చామా.. ప్యాకప్ చెప్పామా అని మొక్కుబడిగా కాకుండా సినిమా స్టోరీ నుండి సీన్స్ వరకు ఇన్వాల్వ్ అయి ట్యూన్స్ క్రియేట్ చేసుకునే DSP, సినిమా సక్సెస్ కి తన మ్యూజిక్ ఎసెట్ అయ్యేలా ప్లాన్ చేసుకుంటాడు. అందుకే ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ హ్యాప్పెనింగ్ డైరెక్టర్స్ కి మోస్ట్ ఫేవరేట్ మ్యూజిక్ కంపోజర్ దేవి శ్రీ ప్రసాద్.