‘బుర్రకథ’ ట్రైలర్ రివ్యూ

Monday,June 24,2019 - 11:52 by Z_CLU

విక్టరీ వెంకటేష్ చేతుల మీదుగా రిలీజైంది ఆది సాయికుమార్ కొత్త సినిమా ‘బుర్రకథ’ ట్రైలర్. గతంలో రిలీజైన టీజర్ కి కొనసాగింపుగా ఉన్న ఈ ట్రైలర్ సినిమాపై మరింత ఇంట్రెస్ట్ ని జెనరేట్ చేసింది.

ట్రైలర్ ని బట్టి చూస్తే సినిమాలోని ఫన్ ఎలిమెంట్స్ కి, యాక్షన్ ఎలిమెంట్స్ కి రీజన్ ఒక్కటే. హీరోకి 2 బ్రెయిన్స్ ఉండటమే. అందుకే ఈ సినిమాకు వెరైటీగా బుర్రకథ అనే టైటిల్ పెట్టారు. ఒకే హీరోలో 2 డిఫెరెంట్ క్యారెక్టరైజేషన్స్.. సినిమాలోని హై పాయింట్ ఇదే.

హీరో క్యారెక్టర్ నుండి కాస్త పక్కకు వస్తే ‘బుర్రకథలో ఫాదర్ సెంటిమెంట్ కూడా ఉంది. విలన్ చేతిలో గాయపడిన రాజేంద్రప్రసాద్ ‘కొడుకు ఉన్న వాడితో పెట్టుకోకూడదు..’ అని చెప్పే డైలాగ్, ఇది 100% ఫ్యామిలీ సినిమా అని చెప్పకనే చెప్తుంది.  

ఇకపోతే 2 బ్రెయిన్స్ వల్ల ఇబ్బంది పడే హీరో… ఏ సిచ్యువేషన్ లో ఇద్దరిలా కాకుండా ఒక్కడిలా ఆలోచిస్తాడన్నదే సినిమాలో ఇంట్రెస్టింగ్ పాయింట్.

ఈ సినిమాకి డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహించాడు. H.K. శ్రీకాంత్ దీపాల దీపాల ఆర్ట్స్ బ్యానర్స్ పై ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. మిస్తీ చక్రవర్తి హీరోయిన్ గా నటించిన ఈ సినిమా  ఈ వీకెండ్ ఎట్రాక్షన్ గా థియేటర్లలోకి వస్తోంది.