బుర్రకథ.. కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్

Tuesday,July 02,2019 - 02:52 by Z_CLU

సెన్సార్ సమస్యల వల్ల పోస్ట్ పోన్ అయిన బుర్రకథ సినిమాకు కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. జులై 5న ఈ సినిమా థియేటర్లలోకి రాబోతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రయిలర్ తో పాటు సాంగ్స్ కు ట్రెమండస్ రెస్పాన్స్ రావడంతో మూవీపై అంచనాలు పెరిగాయి.

ఆది సాయికుమార్ హీరోగా నటించిన ఈ సినిమాలో మిస్తీ చక్రవర్తి, నైరా షా హీరోయిన్లుగా నటించారు. డైమండ్ రత్నబాబు ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమౌతున్నాడు. రాజేంద్రప్రసాద్, పోసాని కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాకు సాయికార్తీక్ సంగీతం అందించాడు.

ఒక మనిషికి 2 బ్రెయిన్స్ ఉంటే ఎలా ఉంటుందనే టిపికల్ కాన్సెప్ట్ ను హిలేరియస్ గా చూపించారు ఈ సినిమాలో. అదే ఈ సినిమాకు మెయిన్ ఎట్రాక్షన్.